రజనీ ఫ్యాన్స్‌పై పిడుగులాంటి వార్త.. రోబో2.0 విషయంలో అసంతృప్తి
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులపై పిడుగులాంటి వార్త పడింది. ఇప్పటికే ఆలస్యమైన రోబో2కు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారవుతున్నది. వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్ కారణంగా ఈ చిత్ర విడుదల జాప్యం జరుగడం మరింత కుంగదీస్తున్నది. ఈ చిత్రానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటిగ్రేషన్ (సీజీఐ) పనులపై చిత్ర యూనిట్, దర్శకుడు శంకర్ పెదవి విరిచాడట. దాంతో ఈ చిత్రానికి మరిన్ని మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట. త్వరలోనే మార్పులకు సంబంధించిన సీజీ పనులు మొదలుపెట్టనున్నట్టు సమాచారం.

రోబో2 చిత్రాన్ని వాస్తవానికి 2018 మేలో రిలీజ్ చేయాలనుకొన్నారు. దానిని ఆగస్టుకు వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా మళ్లీ 2019కి వాయిదా వేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











