రజనీకాంత్ ‘దర్బార్’కు లీక్స్ బెడద..ఈ సారి ఏకంగా సీన్ లీక్!

రజనీకాంత్ లేటెస్ట్ మూవీ 'దర్బార్' షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌. ప్రముఖ తమిళ కమెడియన్ యోగిబాబు, నివేథా థామస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తాజాగా రజనీకాంత్‌పై చిత్రీకరించిన ఓ సీన్ సోషల్ మీడియాలో లీకైంది. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ముందు నుంచే లీకుల పర్వం మొదలైంది. ఇపుడు ఏకంగా సీన్ లీక్ కావడంతో చిత్ర బృందం ఆందోళనలో పడింది. ఇకపై ఎలాంటి లీక్స్ కాకుండా తగిన చర్యలకు ఉపక్రమించింది. లీకైన సీన్లో రజనీతో పాటు యోగి బాబు, నివేథా థామస్ ఉన్నారు. నివేథా ఈ చిత్రంలో రజనీ కూతురు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Rajinikanths Darbar leaked picture goes viral

ఈ మూవీలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ చివరగా 1992లో వచ్చిన 'పాండ్యన్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. మళ్లీ 27 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా శుభకరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X