'దర్బార్' నుంచి సూపర్ అప్‌డేట్.. ఆ పనులు మొదలెట్టిన రజినీకాంత్
సీనియర్ హీరో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా 'దర్బార్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ జోడీగా నయనతార నటిస్తోంది. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ప్రస్తుతం చిత్రంలోని రజినీకాంత్ పాత్రకె సంబంధించిన డబ్బింగ్ జరుగుతోంది. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు రజినీకాంత్. ఇందుకు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవర్ ఫేవరేట్ ఆల్ రౌండర్ రజినీకాంత్ అంటూ వీటిపై కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ప్రస్తుతం రజినీకాంత్ అభిమానులందరి దృష్టి 'దర్బార్' సినిమాపైనే ఉంది. ఈ సినిమా విడుదల కోసం అంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.
'దర్బార్' సినిమాలో ముంబైలోని సౌత్ జోన్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్‌గా రజినీకాంత్ కనిపించనున్నాడు. గతంలో కూడా రజినీ పోలీస్ ఆఫీసర్స్ పాత్రలు చేసినప్పటికీ ఈ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, సునీల్ శెట్టి కీలకమైన పాత్రల్లో కనిపించనుండటం విశేషం.


Click it and Unblock the Notifications











