రజనీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి వేడుక మొదలైంది (ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోస్)
రజనీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. నటుడు, బిజినెస్‌మ్యాన్ విశాగన్ వనంగమూడితో సౌందర్య వివాహం జరుగబోతోంది. శుక్రవారం చెన్నైలో ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నైలోని రాఘవేంద్ర కళామండపంలో ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు రజనీకాంత్ కుటుంబానికి చెందిన బంధవులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుక ఫిబ్రవరి 11న జరుగబోతున్నట్లు తెలుస్తోంది.

సౌందర్య-విశాగన్
చెన్నైలోని కొడంబాక్కంలో జరిగిన వేడుకలో సౌందర్య-విశాగన్.. రజనీకాంత్ కుటుంబ సభ్యులు. తమిళ సాంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరుగుతోంది. ప్రముఖులంతా ఫిబ్రవరి 11న జరిగే వివాహ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.

విశాగన్ వనంగమూడి
విశాగన్ గతేడాది ‘వంజగర్ ఉలగమ్' అనే సినిమాతో గతేడాది నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇతడు తమిళనాడుకు చెందిన బిజినెస్‌మేన్ ఎస్ఎస్ వనంగమూడి, ఉషా దంపతుల కుమారుడు.

స్నేహం తర్వాత పెళ్లి దిశగా...
సౌందర్య రజనీకాంత్ దర్శకురాలిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. నటుడిగా కెరీర్ ప్రారంభించిన విశాగన్‌తో కొంతకాలం క్రితమే స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, పెళ్లి దిశగా అడుగు వేయడం జరిగింది.

వైభవంగా వివాహం
తన కూతురు వివాహాన్ని రజనీకాంత్ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆయన స్వయంగా వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికలు అందించారు. ఫిబ్రవరి 11న జరిగే వేడుకకు అభిమానులు కూడా భారీగా హాజరు కాబోతున్నారు.

సౌందర్య రజనీకాంత్
సౌందర్య మొదటి వివాహం పారిశ్రామిక వేత్త అశ్విన్ రామ్ కుమార్‌తో 2010లో జరిగింది. 2016లో ఇద్దరూ విడిపోయారు. వీరికి వేద్ అనే కుమారుడు కూడా ఉన్నారు. విశాగన్‌తో సౌందర్య కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.


Click it and Unblock the Notifications











