2.0 మూవీపై రజనీకాంత్ కూతురు రివ్యూ... ఏం చెప్పిందంటే?
రజనీకాంత్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడింది. ఫ్యాన్స్ అంతా గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న 2.0 నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైనంది. రజనీకాంత్-అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్లతో పాటు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన భారీతనం, 3డి ఎఫెక్ట్స్, 4డి సౌండింగ్ లాంటివి సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.
శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్‌ను తెరపై చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. టెక్నికల్ అంశాల పరంగా అద్భుతమైన అనుభూతిని ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్ట్స్ నుంచి సైతం ఈ మూవీకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా రజనీకాంత్ కూతురు సౌందర్య సైతం ఈ సినిమాపై స్పందించారు.
సౌందర్య రజనీకాంత్ రివ్యూ
2.0 సినిమా చూసిన అనంతరం సౌందర్య రజనీకాంత్ ఒకే ఒక్క లైన్లో సినిమా రివ్యూ చెప్పేశారు. ‘ఓ మై గాడ్... 2.0 ఔటాఫ్ దిస్ వరల్డ్' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
అద్భుతమైన రోజు అంటూ రజనీకాంత్
2.0 చిత్ర బృందానికి చీర్స్ చెబుతూ రజనీకాంత్.... నిన్న రాత్రి 12 గంటల తర్వాత ట్వీట్ చేశారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు అంటూ సినిమా విడుదల పట్ల తన ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేశారు.

ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ
2.0 చిత్రం రజనీకాంత్ కెరీర్లో మాత్రమే కాదు... ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఇంత భారీ బడ్జెట్(దాదాపు రూ. 600 కోట్లు)తో తెరకెక్కిన సినిమా లేదు. బడ్జెట్ పరంగా బాహుబలిని దాటేసింది.

ఆ రికార్డులను అధిగమిస్తుందా?
ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘బాహుబలి 2'. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ‘దంగల్' పేరున ఆ రికార్డ్ ఉంది. మరి 2.0 మూవీ ఈ రెండు చిత్రాల రికార్డులను అధిగమిస్తుందా? లేదా?.. అనే అంశంపై ఫస్ట్ వీకెండ్ వరకు ఓ అంచనాకు రావొచ్చు.


Click it and Unblock the Notifications











