»   » డాక్యుమెంటరీగా రాబోతున్న రజనీకాంత్ హిమాలయ పర్యటన!

డాక్యుమెంటరీగా రాబోతున్న రజనీకాంత్ హిమాలయ పర్యటన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌‌కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. సంవత్సరానికి ఒకసారైనా ఆయన హిమాయాలకు వెళ్లి దైవ చింతనలో గడిపివస్తుంటారు. కొన్ని రోజుల క్రితం కూడా ఆయన హిమాలయాలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలి రజనీకాంత్ హిమాలయ పర్యనట డాక్యుమెంటరీ రూపంలో రాబోతోందట. ఈ పర్యటనను రజనీ టీమ్ కెమెరాలో చిత్రీకరించిందని, దీన్ని ఎడిట్ చేసి లఘు చిత్రంగా మార్చాలనే ప్లాన్లో ఉన్నారట.

Rajinikanths Himalayan tour to be made into a documentary film

రజనీ రాజకీయాల్లోకి ఎంటరైన నేపథ్యంలో ఆయన ఆలోచనలు ప్రజలకు తెలిసేలా 'రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలు' పేరిట ఈ డీవీడీలు విడుదల చేస్తారని అంటున్నారు. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుంది.

తమిళనాడులో మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన రజనీకాంత్ త్వరలోనే పార్టీ పేరు ప్రకటించనున్నారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్ తన పార్టీ తరుపున అభ్యర్థులను సైతం రంగంలోకి దింపనున్నారు. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే ఆయన సినిమాల్లో కొనసాగనున్నారు.

English summary
The latest update is that Rajinikanth’s recent trip to The Himalayas will be made into a short documentary film. Apparently, Rajini’s journey to Himachal Pradesh and Uttarakhand, the people he had met and some candid footage etc were captured on camera. The footage has been edited and was turned into a short documentary film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X