తన శత్రువుల గురించి రజనీకాంత్ (ఇంటర్వ్యూ-1)

By Bojja Kumar

చెన్నై: తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తమిళ స్టార్ హీరీరో రజనీకాంత్ తమిళ టెలివిజన్ జయా టీవీకి ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. మార్చి 26వ తేదీన చిత్రీకరించిన ఈ ఇంటర్వ్యూ ఈ రోజు(ఏప్రిల్ 14) తమిళ నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసారు. తమిళ కమెడియన్ వేవిక్ ఈ ఇంటర్వ్యూలో రజనీకాంత్‌పై పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు.

రజనీకాంత్ పర్సనల్ లైఫ్, ఆధ్యాత్మిక భావాలు, సినిమాలు, తన రాబోయే సినిమా 'కొచ్చాడయాన్' గురించి ప్రశ్నలతో ఈ ఇంటర్వ్యూ సాగింది. వివిధ అంశాల గురించి సాగిన ఈ కార్యక్రమంలో రజనీకాంత్ ఇది వరకు ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పని పలు ప్రశ్నలకు ఇందులో సమాధానాలు ఇచ్చారు.

ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటోలు, రజనీ చెప్పిన విశేషాలు స్లైడ్ షోలో......

శత్రువులను క్షమించిన రజనీ

శత్రువులను క్షమించిన రజనీ

రజనీకాంత్ సినిమా పాటలోని ఓ లైన్‌ను గుర్తు చేసుకున్న కమెడియన్ వివేక్....మీ శత్రువులను మీరు క్షమించారా? అని అడిగిన ప్రశ్నకు రజనీ స్పందిస్తూ ‘అవును' అని సమాధానం ఇచ్చారు.

రజనీకాంత్ తన శత్రువులను ఎందుకు క్షమించారు?

రజనీకాంత్ తన శత్రువులను ఎందుకు క్షమించారు?

శత్రువులను క్షమించడం వెనక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నకు రజనీ స్పిందస్తూ.....క్షమాపణ అనేది లేకుంటే మనం సంతోషాన్ని, శాంతిని చూడలేము అని తెలిపారు.

స్మోకింగ్ గురించి

స్మోకింగ్ గురించి

స్మోకింగ్ గురించి యువతకు మీరు ఏం చెబుతారు? అనే ప్రశ్నకు రజనీకాంత్ స్పందిస్తూ....‘అది చాలా చెడ్డ అలవాటు' అని అని తెలిపారు.

యువతకు సందేశం

యువతకు సందేశం

ఏదైనా చెడ్డ అలవాటు ఒకసారి అలవాటు అయితే, అది మనం అదుపుచేసుకోలేనంతగా మారితే....బయట పడటం కష్టం. అందుకే యువత ఎలాంటి చెడ్డ అలవాట్లకు అడిక్ట్ కావొద్దని రజనీ సూచించారు.

రజనీకాంత్ ఫేవరెట్ డైలాగ్

రజనీకాంత్ ఫేవరెట్ డైలాగ్

రజనీకాంత్ తన ఫేవరెట్ డైలాగ్ గురించి ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఐతు ఇప్పడి ఇరుక్కు' అనేది తన ఫేవరెట్ డైలాగ్ అని తెలిపారు.

‘ఐతు ఇప్పడి ఇరుక్కు'

‘ఐతు ఇప్పడి ఇరుక్కు'

రజనీకాంత్ ఫేవరెట్ డైలాగ్ ‘ఐతు ఇప్పడి ఇరుక్కు' అనేది బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన Pathinaaru Vayathinile అనే తమిళ చిత్రంలోనిది. ఈచిత్రం తెలుగులో ‘పదహారేళ్ల వయసు' పేరుతో విడుదలైంది.

అజిత్-విజయ్ గురించి రజనీకాంత్

అజిత్-విజయ్ గురించి రజనీకాంత్

తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.....విజయ్‌లోని మంచి స్వభావము, అజిత్ ముక్కు సూటి తనం తనకెంతో నచ్చుతాయని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X