twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ ‘కాలా’ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

    By Bojja Kumar
    |

    రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కాలా' సెన్సార్ విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ 14 కట్స్ పెట్టిందని, యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లలో ఒకరైన వినోద్ క్లారిటీ ఇచ్చారు.

    'కాలా' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని... అయితే 14 కట్స్ అనేది నిజం కాదని తెలిపారు. ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందనే వార్తలు కూడా వినిపించాయి, ఇవి పూర్తిగా నిరాధారమైనవి అని నిర్మాత వినోద్ తెలిపారు.

    Rajinikanths Kaala get U/A

    ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే కోలీవుడ్లో సమ్మె జరుగుతున్నందున సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ఒక వేళ ఆ సమయానికి సమ్మె పూర్తయితే అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. 'కాలా' చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లైకా ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు. వారి నిర్ణయం మీదే సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది.

    'కాలా' చిత్రాన్ని దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రజనీకాంత్ సినిమా కావడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. దాదాపు రూ. 125 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. దీంతో పాటు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 75 కోట్లు అదనంగా వచ్చాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన రజనీకాంత్ అల్లుడు ధనుష్ రూ. 125 కోట్ల లాభాన్నీ సినిమా రిలీజ్ ముందే ఆర్జించారు.

    English summary
    Rajinikanth's Kaala has been censored with U/A. Vinod, the executive producer of Wunderbar Films confirms this news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X