రజనీ, పా రంజిత్‌కు నోటీసులు.. కష్టాల్లో కాలా చిత్రం

By Rajababu

సూపర్‌స్టార్ రజనీకాంత్, పా రంజిత్, వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ, సౌతిండియన్ ఫిల్మ్ యాక్టర్స్ అసోసియేషన్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కాలా చిత్రం టైటిల్‌కు సంబంధించిన కాపీరైట్ వ్యవహారంలో ఫిబ్రవరి 12వ తేదీ లోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కాలా చిత్రంతో సంబంధమున్న వారిపై అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖరన్ దాఖలు చేసిన పిల్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

 రజనీతో సినిమా చేయాలని..

రజనీతో సినిమా చేయాలని..

ఫిర్యాదుదారు రాజశేఖరన్ పిల్‌లో పేర్కొన్న ప్రకారం.. కాలా చిత్రం షూటింగ్ ప్రారంభానికి ఓ దశాబ్దానికంటే ముందే రజనీకాంత్‌తో సినిమా చేయాలని అనుకొన్నాను. ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలనుకొన్న ఆ ప్రాజెక్ట్‌కు కాలా కరికాలన్ అనే పేరును తాను ఖారారు చేశాను అని తెలిపారు.

Recommended Video

రజనీ ప్రభంజనం సృష్టిస్తారా ?
కథ, టైటిల్ చౌర్యానికి గురైంది..

కథ, టైటిల్ చౌర్యానికి గురైంది..

కాలా చిత్ర షూటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది ఈ చిత్ర నిర్మాహకులపై రాజశేఖరన్ కేసు ఫైల్ చేశారు. తన కథను, టైటిల్‌ చౌర్యానికి గురైంది అని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 ఆయనకు కథ వినిపించా

ఆయనకు కథ వినిపించా

అంతేకాకుండా రజనీకాంత్ ఫ్యాన్ అసోసియేషన్ అధినేత సత్యనారాయణన్‌కు కాలా కథను వినిపించాను అని పిల్‌లో వెల్లడించారు. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు కాలా నిర్వాహకులు జవాబివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 రజనీ, పారంజిత్ కాంబో

రజనీ, పారంజిత్ కాంబో

కబాలి చిత్రం తర్వాత రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్‌లో రెండో చిత్రంగా కాలా చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రం కోసం ముంబైలోని మురికివాడ ధారవి ప్రాంతం సెట్‌ను ప్రత్యేకంగా వేసి షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి, నానా పాటేకర్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X