ఇదేనంట: రజనీ కొత్త చిత్రం 'కబాలి' స్టోరీ లైన్
చెన్నై : రజనీకాంత్ తదుపరి సినిమా 'కబాలి' అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిత్రంలో కథేమిటి...రజనీ పాత్ర ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిగా నడుస్తోంది. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది. కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు. వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.
తమ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎప్పుడెప్పుడు కొత్త సినిమాతో వస్తారా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూంటారు. ఆ ఎదురుచూపులు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే...ఆయన రీసెంట్ చిత్రం 'లింగ' అంచనాలు తలక్రిందులు చేసి ఫ్లాప్ కావటంతో తదుపరి చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఎవరూ వూహించనివిధంగా ఆయన కొత్త దర్శకుడు రంజిత్‌కు అవకాశమిచ్చారు. ఓకే డైరక్టర్ ఖరారు అయ్యారు. దాంతో ఈ చిత్రం టైటిల్ ఏమిటి..కథ ఏమిటి అనే విషయాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.
ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం. మరిన్ని వివరాలు కోసం క్రింద స్లైడ్ షో చూడండి.

దన్సిక మాట్లాడుతూ...
దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు.

కార్తిక్ సుబ్బరాజు తండ్రి
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు

రజనీ రిక్వెస్ట్
తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం.

ఫస్ట్ లుక్ ఎప్పుడంటే
సినిమా ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 17న రానుందని సమాచారం.

ఫ్యాన్ మేడ్
చిత్రానికి సంబంధించిన 'ఫ్యాన్స్‌మేడ్' ఫొటోలు, పోస్టర్లు మరింత ఆసక్తికరంగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలురకాల పోస్టర్లు కనిపించగా.. తాజాగా రజనీకాంత్ ఒరిజినల్ రూపురేఖలతో ఉన్న చిత్ర పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

హీరోయిన్ తో ఫొటో షూట్
హీరోయిన్ రాధికా ఆప్టే తో ఫార్మల్ ఫోటో షూట్ నిర్వహించినట్లు సమాచారం.

మేకప్ లేకుండా
ఇందులో రజనీకాంత్ అసలైన రూపంలో అంటే మేకప్ లేకుండానటిస్తున్నారని ఆదివారం నుంచి ప్రచారమవడంతో దీనికి సంబంధించిన ఫ్యాన్స్‌మేడ్ ఫొటోలు కూడా దర్శనం ఇస్తున్నాయి.

ఫ్లాష్ బ్యాక్ లో
సినిమాలో ఒరిజనల్ లుక్ తో మేకప్ లేకుండా కనపడినా ...ఫ్లాష్ బ్యాక్ సీన్లలో మాత్రం మేకప్ వేసి లుక్ మారుస్తారని చెప్తున్నారు.

దర్శకుడు గురించి
ఇక దర్శకుడు రంజిత్ ..విషయానికి వస్తే...అతనో యంగ్ డైరెక్టర్.. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్.

క్యూని దాటి
రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.

నిర్మాత ఎవరంటే...
తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు.

ఇదేనంట: రజనీ కొత్త చిత్రం 'కబాలి' స్టోరీ లైన్
తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏ మేరకు మెప్పిస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











