బాకీ పడ్డారు: చిక్కుల్లో రజనీ ‘కొచ్చాడయాన్’?
హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' చిత్రం మే 9న కూడా విడుదల కావడం కష్టంగానే కనిపిస్తోంది. నిర్మాత మురళీ మనోహర్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య డబ్బుల చెల్లింపుల విషయంలో విబేధాలు రావడమే ఇందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
కొన్ని కోట్ల రూపాయల సెటిల్మెంట్ కావాల్సి ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా విడుదల ఈ నెల 9న విడుదల అవుతుందో? లేదో? అనే సందిగ్ధం నెలకొంది. దీంతో సినిమా విడుదలకు ముందు పేపర్లు, టీవీ ఛానల్స్‌లో ఇవ్వాల్సిన ప్రకటనలను తాత్కాలికంగా ఆపి వేసినట్లు తెలుస్తోంది. వివాదాన్ని పరిష్కరించేందుకు నిర్మాత మురళి మనోహర్ డిస్ట్రిబ్యూటర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తలపై స్పందించేందుకు నిర్మాత మురళి మనోహర్, దర్శకురాలు సౌందర్య అందుబాటులోకి రావడం లేదు. కాగా...తమిళనాడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సెక్రటరీ జయకుమార్ ఈ వార్తలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదన్నారు. సాధారణంగా పెద్ద సినిమా విడుదల ముందు పర్సంటేజీలు, టికెట్ రేట్స్ విషయంలో చర్చలు జరుపడం మామూలే అని, కొచ్చాడయాన్ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందని తెలిపారు.
సినిమాకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ విడుదల అవుతాయని, మరో వైపు టాక్స్ ఎక్సెంప్సన్ కూడా గ్రాంటయిందని, సినిమా విడుదల షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపారు. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ, పంజాబీ, బోజ్‌పురి, మరాఠీ భాషలలో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈచిత్రం విక్రమ సింహా పేరుతో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











