ఇలా చేస్తున్నారేంటి? రజనీకాంత్ ‘లింగా’ టీంపై ఆగ్రహం

By Bojja Kumar

బెంగుళూరు: రజనీకాంత్ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'లింగా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ కర్నాటకలోని లింగనమక్కి డ్యాం వద్ద జరుగుతోంది. అయితే వీరు సినిమా షూటింగ్ పేరుతో డ్యాంను కలుషితం చేస్తున్నారని పర్యావరణ ప్రేమికులు మండి పడుతున్నారు. వీరు చేస్తున్న ఆందోళన తాజాగా డిప్యూటీ కమీషనర్ ఆఫీసు వరకు వెళ్లింది.

షూటింగ్ సందర్భంగా 'లింగా' మూవీ టీం పర్యావరణానికి హాని కలుగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని, డ్యాం పరిసరసన ప్రాంతాల్లోని అట్మాస్పియర్‌ను పాడు చేస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వేస్టేజ్ అక్కడే పడేస్తున్నారని, వర్కర్స్ కేర్ లెస్‌గా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఇక్కడ షూటింగ్ నిలిపి వేసి వెళ్లి పోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Rajinikanth's Lingaa Faces The Ire Of Environmentalists

ఈ మేరకు డిప్యూటీ కమీషనర్ ఆఫీసులో ఓ పిటీషన్ కూడా సమర్పించారు. వెంటనే 'లింగా' మూవీ టీంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన కారులు డిప్యూటీ కమీషనర్‌తో పాటు కర్నాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్యకు కూడా పిటీషన్ కాపీ పంపాపరు. అయితే ఉన్నట్టుండి అక్కడ షూటింగ్ కాన్సిల్ చేయిస్తే నిర్మాతకు భారీ నష్టం వస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

పర్యావరణ ప్రేమికుల ఆందోళనతో 'లింగా' టీం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వెంటనే సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తనకు క్లోజ్ ఫ్రెండ్, నటుడు, మంత్రి అయిన అంబీష్‌ను సహాయం కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. పొలిటికల్ సపోర్టు ఉండటంతో 'లింగా' టీంకు షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఢోకా ఉండదని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X