రజనీ స్టైల్ అదిరింది: ‘లింగా’ ఫస్ట్ లుక్ (ఫోటో)
హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా సినిమా 'లింగా' ఫస్ట్ లుక్ ఫోస్ట్ విడుదల చేసారు. సినిమాలో రజనీకాంత్ ను ఎంత స్టైలిష్‌గా చూపించబోతున్నారో ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. పోస్టర్ రిలీజ్ లుక్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రి రిలీజ్ బజ్

రజనీకాంత్ సినిమా కోసం అభిమానులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పరిగేలా చేసింది. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నారు.
ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనిపించనున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ''రజనీకాంత్‌ను మరోసారి మాస్ లుక్‌లో చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.


Click it and Unblock the Notifications











