రజనీకాంత్ ‘పెట్టా’... ఆసక్తిరేకెత్తిస్తున్న నవాజుద్దీన్ ఫస్ట్ లుక్
రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం 'పెట్టా' సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో ఆయన సింగార్ సింగ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే నవాజుద్దీన్ సిద్ధిఖీ వయసు ఎక్కువ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే ఆయన మేకప్ ఉండటం గమనార్హం. హిందీలో నటుడిగా తక్కువ కాలంలోనే టాప్ రేంజికి వెళ్లిన నవాజుద్దీన్.... తొలిసారి తమిళంలో నటిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పెట్టా షూటింగ్ విశేషాల్లోకి వెళితే... ఈ చిత్రం షూటింగ్ జూన్లో మొదలైంది. తొలి షెడ్యూల్ డార్జిలింగ్‌లో పూర్తి చేయగా.. సెకండ్ షెడ్యూల్ లక్నోలో పూర్తి చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోస్, వీడియోస్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ లీక్ వ్యవహారంపై కాస్త సీరియస్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాలో అలాంటివేమీ పోస్టు చేయవద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శశి కుమార్, సిమ్రన్, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











