'పెట్ట' లీక్ ఎఫెక్ట్.. పోలీస్ బందోబస్తు నడుమ సూపర్ స్టార్ రజని!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ప్రతిభగల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ పెట్ట. స్టైలిష్ లుక్ లో రజని అదరగొట్టాడు. పెట్ట ఫస్ట్ లుక్ లో రజనీకాంత్ యంగ్ గా కనిపిస్తుండడం విశేషం. ఈ లుక్ సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రెండింగ్ గానే ఉంది.

ఫస్ట్ లుక్ విడుదలయ్యాక రజనీకాంత్ స్టిల్ కూడా లీక్ అయింది. దీనితో చిత్ర యూనిట్ అలెర్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా సెట్స్ నుంచి మరో లీకేజి ఉండకూడదని చిత్ర యూనిట్ భావిస్తోందట. డెహ్రాడూన్, చెన్నై షెడ్యూల్స్ పూర్తి చేసిన తరువాత ప్రస్తుతం దర్శకుడు లక్నోలో షూటింగ్ జరుపుతున్నాడు.

Rajinikanths Petta stills leaked, security beefed on sets

500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఈ సన్నివేశాలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా భారీ బందోబస్తు నడుమ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

25 మంది లక్నో పోలీసులు షూటింగ్ లొకేషన్ లో భద్రత కల్పిస్తున్నారట. షూటింగ్ జరిగినన్ని రోజులు రజనీకాంత్ కు ఎస్కార్ట్ భద్రత ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రజనికాంత్ ప్రొఫెసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్రిష, సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X