twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేసవిలో అలరించనున్న రజనీ-ఐష్ ల 'రోబో'

    By Sindhu
    |

    'రోబో" సౌత్‌ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ కథానాయికగా తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ ఆవిష్కరిస్తున్న భారీ చిత్రం 'రోబో" చిత్రం వేసవిలో అలరించడానికి సమాయత్తమవుతోంది. సి. కరుణమూర్తి నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రం ఇతి వృత్తం బయటకు పొక్కకుండా పకడ్భందీగా తెరకెక్కిస్తున్నప్పటికీ సినిమాలోని కొన్ని కీలకాంశాలు ఇటీవల ఇంటర్నెట్‌లలో దర్శనమిస్తుండటంతో బెంబేలెత్తిన శంకర్‌ ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్‌ స్వయంగా పత్రికలకు విడుదల చేసారు. 'జెంటిల్‌మేన్‌" చిత్రం నుంచి నిన్నటి 'శివాజీ" చిత్రం వరకూ ఎక్కడా రాజీ పడకుండా భారీ చిత్రాలను తనదైన శైలిలో ఆవిష్కరిస్తున్న శంకర్‌ 'రోబో" తన డ్రీమ్‌ స్క్రిప్ట్‌ అని ఎప్పుడూ చెబుతూ వుంటారు.

    ఎల్లలు దాటి అభిమానులను సొంతం చేసుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ చిత్రంలో కథానాయకుడు కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఆరాధించే అందాల నాయిక మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ అందాలు అభిమానులను అలరించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో సమ్మర్‌ స్పెషల్‌గా జూన్‌లో విడుదల కానుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X