ఆస్కార్స్ కు రజనీకాంత్ రోబో, శంకర్ కు అమీర్ ఖాన్ సలహా
రజనీకాంత్ రోబో సినిమా ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. సినిమాను చూసిన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రోబో దర్శకుడు శంకర్ కు ఫోన్ చేశాడట. శంకర్ కు అమీర్ కృతజ్ఞతలు తెలపడమే కాకుండా అద్భుతమైన సినిమా తీశారని మెచ్చుకున్నారని వినికిడి. అంతేకాదు, ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడేందుకు అవసమైన అన్ని లక్షణాలు సినిమాకు ఉన్నాయని చెప్పారని అంటున్నారు. ఆస్కార్స్ కోసం అమీర్ ఖాన్ పీప్లీ లైవ్ భారత అధికారిక ఎంట్రీగా ఆస్కార్స్ కు వెళ్తోంది. వ్యక్తిగత స్థాయిలో శంకర్ తన రోబో సినిమాను ఆస్కార్ సెలెక్షన్ బోర్డుకు పంపాల్సి ఉంటుంది. శంకర్ అందుకు సిద్ధపడుతున్నారని చెబుతున్నారు. ఏమైనా, భారత జాతకం ఎలా ఉందో చూడాలి.


Click it and Unblock the Notifications











