మేనేజ్ మెంట్ స్టూడెంట్స్ కి పాఠంగా 'రోబో' చిత్రం
రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం "రోబో" ఇఫ్పుడు భారత దేశంలో ఉత్తమ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ గా పేరు పొందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, అహ్మదాబాద్ లో పాఠంగా పెట్టనున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ తమిళ వెర్షన్ ని కాంటింపరరీ ఫిల్మ్ ఇండస్ట్రీ విభాగంలో చేర్చారు. ఈ చిత్రం సాధించిన ఘన విజయానికి కారణం వారు అవలించిన మార్కెటింగ్ విధానాలు అనే యాంగిల్ లో ఈ సినిమాను పాఠ్యాంశంగా బోధిస్తారు. ఈ చిత్రాన్ని ఓ కేస్ స్టడీగా చూపుతూ సినిమా వ్యాపారం విశ్లేషణగా వివరించనున్నారు. అలాగే ఇంతకుముందు కూడా రజనీ ముత్తు చిత్రం కూడా సిలబస్ లో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న వారు రజనీకాంత్ కి అసాధ్యమైనది ఏదీ లేదని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











