twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ సూపర్ హిట్ చిత్రం 48 నిమిషాల కట్ చేసి...

    By Srikanya
    |

    చైన్నై : రజనీకాంత్‌,శంకర్‌ కలయికలో వచ్చి సూపర్ హిట్టైన చిత్రం 'శివాజి'. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఏవీయమ్‌ సంస్థ నిర్మించింది. ఇప్పుడీ చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నుంచి ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే త్రీడీ సినిమా కోసం నిడివి తగ్గించాల్సి వస్తోంది. కథాగమనం దెబ్బతినకుండా కొన్ని సన్నివేశాలను
    తొలగించడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

    ఇక ఈ చిత్రం 185 నిమిషాలపాటు సాగుతూంటే యాక్షన్ ఎంటర్టైనర్. ప్రస్తుతం త్రీడి వెర్షన్ కోసం 137 నిమిషాలకు కుదిస్తున్నారు. అంటే 48 నిమిషాల నిడివి గల సన్నివేశాలకు కత్తెర్లు పడతాయన్నమాట. అక్టోబరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. 2డీ పరిజ్ఞానంతో చిత్రించిన ఈ సినిమాను ఇప్పుడు త్రీడీలోకి మారుస్తున్నారు. చెన్నైలోని ప్రసాద్‌ ఈఎఫ్‌ఎక్స్‌లో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి.

    సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలుకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్. ఆ సినిమాలు ఎన్ని సార్లు రిపీట్ రిలీజ్ లు ఉన్నా జనం ఎగబడి చూస్తారు. అలాంటిది ఆ సినిమాని త్రీడి కి కన్వర్ట్ చేసి వదిలితే భాక్సాఫీస్ బ్రద్దలు అవుతుంది. ఇప్పుడిదే కమర్షియల్ ఫార్ములతో రనజీకాంత్ సూపర్ హిట్ చిత్రం శివాజీని మారుస్తున్నారు. 'సింహం సింగిల్‌గా వస్తుంది'.. అంటూ 'శివాజి' చిత్రంలో ప్రేక్షకులను అలరించారు రజనీకాంత్‌. శంకర్‌ దర్శకత్వంలో 2007లో వచ్చిందీ చిత్రం. ఏవీఎమ్‌ సంస్థ నిర్మించింది. రజనీ సరసన శ్రియ నటించింది. త్వరలో 'శివాజి'ని 3డీలో చూపించబోతున్నారు.

    2డీలోని 'టైటానిక్‌'ని త్రీడీలోకి తీసుకొచ్చిన తరవాత ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం మొదలైంది. 'శివాజి'కి సంబంధించిన పనులను గతేడాది మొదలుపెట్టారు. అక్టోబరులో 3డీ సినిమా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. రజనీకాంత్‌ ప్రస్తుతం నటిస్తున్న 'విక్రమసింహ'ను మోషన్‌ క్యాప్చర్‌ విధానంలో చిత్రిస్తున్నారు. ఇదీ త్రీడీ సినిమాయే. ఇది డిసెంబరులో విడుదలవుతుంది.
    తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న 'కోచడయాన్' చిత్రం తెలుగు వెర్షన్‌కి 'విక్రమసింహా' అనే పేరును ఖరారు చేశారనేది విశ్వసనీయ సమాచారం. ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపంచనున్నారు. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Rajanikanth's 2007 blockbuster, directed by Shankar, is being converted into 3D by the production house AVM. The film had Shirya playing the female lead while Suman played the antagonist. The film's music was composed by Oscar-winner A R Rahman. Producer M S Guhan is overseeing the 3D conversion of the film at Prasad EFX, which is situated in Chennai. The special effects house, which has also worked on the 3D conversion of some Hollywood films, had showcased their works to Guhan, who, then, hit upon the idea to give Sivaji the 3D treatment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X