రజనీకాంత్ అల్లుడికి లండన్ ఎయిర్‌పోర్టులో షాకింగ్ అనుభవం!

రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య, ఆమె భర్త విశాగన్ వనంగమూడి తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. ఇటీవల ఇద్దరూ కలిసి లండన్ వెళ్లారు. ఈ సారి విశాగన్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్, డబ్బు కలిగి ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్నాడు.

సౌందర్య, విశాగన్ చెన్నై విమానాశ్రయం నుండి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ద్వారా లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. లండన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే విశాగన్ తన పాస్‌పోర్ట్ కోసం వెతకగా అది ఉన్న బ్యాగ్ పోయినట్లు గ్రహించాడు.

Rajinikanths son in law passport stolen

అయితే ఈ బ్యాగ్ ఎప్పుడు దొంగిలించబడిందో తెలియాల్సి ఉంది. పాస్ పోర్ట్ లేక పోవడంతో ఈ జంటను విమానాశ్రయంలోని ఒక గదిలో ఉంచారు. వెంటనే వారు లండన్లోని భారత రాయబార కార్యాలయాన్ని కాంటాక్ట్ కావడంతో వెంటనే వారు స్పందించారు. డూప్లికేట్ పాస్ పోర్ట్ అప్పటికప్పుడు అందించారు. అయితే కనపడకుండా పోయిన అతడి బ్రీఫ్‌కేస్‌ విషయంలో దర్యాప్తు జరుగుతోంది.

సౌందర్య రజనీకాంత్, విశాగన్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సంగతి తెలిసిందే. అశ్విన్ రామ్‌కుమార్‌తో మొదటి వివాహం విఫలం కావడంతో అతడితో విడిపోయిన సౌందర్య విశాగన్‌తో ప్రేమలో పడింది. విశాగన్ కూడా ఇంతకు ముందు కనిఖా అనే మ్యాగజైన్ ఎడిటర్‌ను పెళ్లాడి తర్వాత విడియారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X