Just In
- 2 hrs ago
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- 2 hrs ago
ఇంట్రెస్టింగ్ అప్డేట్: అల్లు అర్జున్ సినిమాలో విలన్ నవదీప్ కాదు.. ఈ సీనియర్ నటుడే.!
- 2 hrs ago
శబ్దం, శాసనం అంటూ బోయపాటి స్టైల్ డైలాగ్‌లు.. మళ్లీ బాలయ్య రచ్చ రచ్చే
- 3 hrs ago
ఫ్యాన్సీ రేట్‌కు వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు
Don't Miss!
- News
Disha case encounter: నాడు సజ్జనార్ లాంటి వాళ్లుంటే: అయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు
- Sports
తొలి టీ20 టీమిండియాదే: కోహ్లీ 94 నాటౌట్, మూడు టీ20ల సిరిస్‌లో 1-0 ఆధిక్యం
- Finance
కుబేరులనూ వదలని ఆర్థిక మాంద్యం: బిజినెస్ జెట్స్ కు గుడ్ బై!
- Lifestyle
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్‌కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
రజనీకాంత్ అల్లుడికి లండన్ ఎయిర్‌పోర్టులో షాకింగ్ అనుభవం!
రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య, ఆమె భర్త విశాగన్ వనంగమూడి తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. ఇటీవల ఇద్దరూ కలిసి లండన్ వెళ్లారు. ఈ సారి విశాగన్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్, డబ్బు కలిగి ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్నాడు.
సౌందర్య, విశాగన్ చెన్నై విమానాశ్రయం నుండి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ద్వారా లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. లండన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే విశాగన్ తన పాస్‌పోర్ట్ కోసం వెతకగా అది ఉన్న బ్యాగ్ పోయినట్లు గ్రహించాడు.

అయితే ఈ బ్యాగ్ ఎప్పుడు దొంగిలించబడిందో తెలియాల్సి ఉంది. పాస్ పోర్ట్ లేక పోవడంతో ఈ జంటను విమానాశ్రయంలోని ఒక గదిలో ఉంచారు. వెంటనే వారు లండన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కాంటాక్ట్ కావడంతో వెంటనే వారు స్పందించారు. డూప్లికేట్ పాస్ పోర్ట్ అప్పటికప్పుడు అందించారు. అయితే కనపడకుండా పోయిన అతడి బ్రీఫ్‌కేస్ విషయంలో దర్యాప్తు జరుగుతోంది.
సౌందర్య రజనీకాంత్, విశాగన్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సంగతి తెలిసిందే. అశ్విన్ రామ్‌కుమార్‌తో మొదటి వివాహం విఫలం కావడంతో అతడితో విడిపోయిన సౌందర్య విశాగన్‌తో ప్రేమలో పడింది. విశాగన్ కూడా ఇంతకు ముందు కనిఖా అనే మ్యాగజైన్ ఎడిటర్‌ను పెళ్లాడి తర్వాత విడియారు.