సూపర్ స్టార్ సూపర్ స్టైల్ లో సూపర్ ఫైట్...!
వెండితెరపై తిరుగులేని సూపర్ స్టార్ రజనీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకునేందుకు అతి త్వరలో 'రోబో" గా రాబోతున్నారు. నెంబర్ వన్ కమర్షియల్ డైరెక్టర్ శంకర్ మరోమారు తన సత్తాని చూపించేందుకు అత్యద్భుగా 'రోబో"ని సిద్దం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు 'రోబో"కి సంబంధించిన ప్రతి వార్తా ఓ సంచలనంగా మారింది. కాగా..తాజాగా వెలుగుచూసి అంతటా ఆసక్తినీ, ఆశ్చర్యాన్నీ రేకెత్తిస్తోన్న 'రోబో" స్పెషల్ న్యూస్ ఏమిటంటే ఆ సినిమా క్లైమాక్స్ లో వందమంది విలన్స్ తో రజనీ ఫైట్ చేస్తారట. ఆ వందమంది విలన్స్ ఎవరో కాదు..రజనీలే తన రూపంతో తనే తయారు చేసిన 100 రోబోలు తనకే విరుద్దంగా మారడంతో వాటన్నింటినీ నాశనం చేసేందుకై రజనీ చేసే ఆ పోరాటాన్ని వీక్షకులను విస్మయానందాన్ని కలిగించే రీతిలో రూపొందించారని సమాచారం.


Click it and Unblock the Notifications











