చీటింగ్ కేసు: సీరియస్‌గా స్పందించిన రజనీకాంత్ భార్య
హైదరాబాద్: రజనీకాత్ సతీమణి లతా రజనీకాంత్ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎవరినీ చీటింగ్ చేయలేదని, ఎవరికీ లోన్ గ్యాంరంటర్ గా లేనని ఆమె స్పష్టం చేసారు. తనపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై చట్టపరంగా ప్రొసీడ్ అవుతానని ఆమె తెలిపారు.
లతా రజనీకాంత్ తోపాటు మరో ముగ్గురిపై బెంగళూరు పోలీసులు ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పబ్లిషర్స్ అండ్ బ్రాడ్‌కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ లెటర్‌హెడ్‌తో మోసగించారని యాడ్ బ్యూరో, దాని నిర్వాహకుడు అబిర్‌చంద్ నహర్ జూన్ 9న దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ బెంగళూరు ఏసీఎంఎం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

గత డిసెంబర్‌లో దాఖలైన కేసుపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. కొచ్చడయాన్ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి మేము రూ.10 కోట్ల ఆర్థిక సహాయం అందించాం. అందుకు గ్యారంటీగా లతా రజనీకాంత్ ఉన్నారు. ఆర్థిక సహాయం చేసినందుకు పంపిణీ హక్కుల్ని ఇస్తామని ఒప్పందం జరిగింది. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమిళనాడు ఏరియా పంపిణీ హక్కుల్ని మరో సంస్థకు అమ్మారు అని యాడ్ బ్యూరో సంస్థ పిటిషన్‌లో పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











