twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చీటింగ్ కేసు: సీరియస్‌గా స్పందించిన రజనీకాంత్ భార్య

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రజనీకాత్ సతీమణి లతా రజనీకాంత్‌ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎవరినీ చీటింగ్ చేయలేదని, ఎవరికీ లోన్ గ్యాంరంటర్ గా లేనని ఆమె స్పష్టం చేసారు. తనపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై చట్టపరంగా ప్రొసీడ్ అవుతానని ఆమె తెలిపారు.

    లతా రజనీకాంత్ తోపాటు మరో ముగ్గురిపై బెంగళూరు పోలీసులు ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పబ్లిషర్స్ అండ్ బ్రాడ్‌కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ లెటర్‌హెడ్‌తో మోసగించారని యాడ్ బ్యూరో, దాని నిర్వాహకుడు అబిర్‌చంద్ నహర్ జూన్ 9న దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ బెంగళూరు ఏసీఎంఎం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

     Rajinikanth's wife Latha denies being loan guarantor

    గత డిసెంబర్‌లో దాఖలైన కేసుపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. కొచ్చడయాన్ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి మేము రూ.10 కోట్ల ఆర్థిక సహాయం అందించాం. అందుకు గ్యారంటీగా లతా రజనీకాంత్ ఉన్నారు. ఆర్థిక సహాయం చేసినందుకు పంపిణీ హక్కుల్ని ఇస్తామని ఒప్పందం జరిగింది. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమిళనాడు ఏరియా పంపిణీ హక్కుల్ని మరో సంస్థకు అమ్మారు అని యాడ్ బ్యూరో సంస్థ పిటిషన్‌లో పేర్కొన్నది.

    English summary
    Tamil superstar Rajinikanth's wife, Latha, on Tuesday denied of being a guarantor for any loan as alleged by a Bengaluru-based firm and threatened 'serious' legal action against its owners for filing a police complaint against her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X