అభిమానలుకు క్షమాపణ చెప్తున్న రజనీకాంత్
రజనీకాంత్ ప్రతీ విషయంలోనూ తన ఫ్యాన్స్ ని ఇన్వాల్స్ చేస్తూంటారు. అయితే రేపు(సెప్టెంబర్ 3)న జరగనున్న పెళ్ళికి మాత్రం వారిని పిలవటం లేదు. ఈ విషయాన్ని రజనీకాంత్ స్పష్టం చేస్తూ...ట్రాఫిక్,సెక్యూరిటీ కారణాల దృష్యా తాను ఫ్యాన్స్ ని పెళ్ళికి పిలవలేక పోతున్నానని అర్ధం చేసుకోవాలని ప్రకటన చేసారు. ఈ పెళ్ళికి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత హాజరవుతున్నారని..కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. అయినా వారి ఆశిస్సులు తన కుమార్తెకు అత్యవసరమని అన్నారు.
పారిశ్రామిక వేత్త అశ్విని కుమార్ తో జరిగే సౌందర్య వివాహానికి భారీగా దేశ విదేశాలనుండి ప్రముఖులు తరలి వచ్చే అవకాసాలున్నట్లు కనిపిస్తోందని తమిళ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడే చిరంజీవి, మోహన్ బాబు, దాసరి నారాయణరావు, జయసుధ, బాలకృష్ణ, మురళీమోహన్, తదితరులకు వివాహ ఆహ్వానాలు ఇచ్చిన రజనీ తన కుమార్తె పెళ్లి ఆహ్వానాలు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు అందించారు. చెన్నైలోని రాజా ముత్తయ్య హాల్ లో జరిగే ఈ వివాహ వేడుకల్లో ఉత్తర, దక్షిణ నటులతో పాటు హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











