twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాణాలంటే లెక్కలేదా? వారిని వదులొద్దు.. కఠినంగా శిక్షించాలి.. రజనీకాంత్ ఫైర్

    |

    తమిళనాడులో సంచలనం రేపిన తండ్రి కొడుకులు పీ జయరాజ్, ఫెనిక్స్ ఎమ్మాన్యుయేల్ జంట మరణాలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. సామాజిక, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ నిరసనను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. జూన్ 19న చోటుచేసుకొన్న జంట మరణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు పోలీసుల తీరును దుయ్యబట్టారు. మానవత్వాన్ని కాలరాచే విధంగా జరిగిన ఈ మరణాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం చేస్తూ తీవ్ర నిరసన తెలిపారు. అసలు ఈ మరణాలకు కారణం, అలాగే రజనీకాంత్ ట్విట్టర్‌లో చేసిన ప్రకటన ఏమిటంటే..

    తండ్రి, కొడుకుల హత్యలకు కారణం..

    తండ్రి, కొడుకుల హత్యలకు కారణం..

    ట్యుటికోరిన్‌లో మొబైల్ షాపును నిర్వహించుకొంటూ పి జయరాజ్ అనే వ్యక్తి జీవితాన్ని లాగిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ సమయం కంటే 15 నిమిషాలపాటు ఎక్కువసేపు తెరిచారే కారణంతో జయరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి జయరాజ్‌ అరెస్ట్ గురించి తెలుసుకొన్న కుమారుడు ఫెనిక్స్ ఇమ్మాన్యుయేల్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అరెస్ట్‌ గురించి ఆరా తీశారు. అక్కడ పోలీసులతో ఫెనిక్స్‌కు వాగ్వాదం చోటుచేసుకోవడంతో తండ్రితోపాటు కొడుకును లాక్‌‌ప్‌లో వేశారు. శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు లాకప్‌లో ఏం జరిగిందో తెలియదు గానీ తండ్రి కొడుకులు మరణించారు. కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. రెండు రోజులపాటు విపరీతంగా కొట్టడం వల్ల రక్త కారిందని, బట్టలకు రక్తం మరకలు అంటడంతో పలుమార్లు దుస్తులు మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    దారుణంగా హింస అని

    దారుణంగా హింస అని

    ఇలా అమానవీయంగా జరిగిన జయరాజ్, ఫెనిక్స్ జంట మరణాలపై, పోలీసుల తీరుపై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. కమల్ హాసన్, సూర్య, విక్రమ్ ఇతర నటీనటులే కాకుండా శిఖర్ ధావన్, హర్బజన్ సింగ్ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో రజనీకాంత్ స్పందించి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

    పోలీసులపై రజనీకాంత్ ఫైర్

    పోలీసులపై రజనీకాంత్ ఫైర్

    ట్యుటికోరిన్ పోలీసుల తీరుపై రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తండ్రి కొడుకులు జయరాజ్, ఫెనిక్స్ మరణాలపై మొత్తం సభ్య సమాజం నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వారు ప్రవర్తించిన తీరు, వ్యవహరించిన విధానం తెలుసుకొని కడుపు మండిపోతున్నది. మనిషి ప్రాణాలంటే విలువలేని వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. వారిని ఈ శిక్ష నుంచి తప్పించుకోకుండా చూడాలి అంటూ రజనీకాంత్ వీడియోలో ఊగిపోయారు.

    Recommended Video

    Kushboo Made Comments on Rajinikanth's Political Entry
    పోలీసు అధికారులపై కేసు నమోదు

    పోలీసు అధికారులపై కేసు నమోదు

    జయరాజ్, ఫెనిక్స్ మరణాల నేపథ్యంలో పోలీసు అధికారులు అయారాజ్,బెన్నిక్స్‌ను అరెస్ట్ చేశారు. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 188, 353, 269, 506 (2) కింద కేసులు నమోదు చేశారు. లాకప్‌లో తండ్రి కొడుకులు జయరాజ్, ఫెనిక్స్‌ను దారుణంగా హింసించారు. వారి ప్రాణాలకు ముప్పు కలగడంతో వారిని హస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే వారిద్దరూ మరణించారని వైద్యులు ధృవీకరించారు. లాకప్‌లో రక్తం కారుతున్నప్పటికీ వారిని దారుణంగా కొట్టారు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

    English summary
    Super Star Rajinikanth serious on ayaraj and Bennix over P Jayaraj, Fenix Emmanuel death. He said, culprit should be punished. At any cost they should not escaped from the punishment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X