మళ్ళీ మెడికల్ చెకప్, రజని అమెరికాకు పయనం.. ఏం జరుగుతోంది!

Recommended Video

Rajinikanth to head to the US For A health inspection

సూపర్ స్టార్ రజనీకాంత్ మరో మారు అమెరికాకు పయనం కానున్నారు. రొగ్య సమస్యలపై ఆయన మీడికల్ చెకప్ కోసం ఆయన యుఎస్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. రజని రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తరువాత అభిమానులు ఎక్కువగా ఆయన గురించే చర్చించుకుంటున్నారు. త్వరలో పార్టీ స్థాపిస్తానని ప్రకటించిన రజనీకాంత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. రజనీకాంత్ నటించిన కాలా, 2.0 చిత్రాలు విడుదల కావలసి ఉంది. ఈ తరుణంలో రజనీకాంత్ ఆరోగ్య విషయం చర్చనీయాంశగా మారడం, ఆయన అమెరికాకు మెడికల్ వెళుతుండడం అభిమానుల్లో కాస్త గందరగోళానికి కారణంగా మారింది.

కొన్ని వారాల పాటు అక్కడే

కొన్ని వారాల పాటు అక్కడే

రజనీకాంత్ త్వరలోనే అమెరికాకు వెళ్లి కొన్ని వారాల పాటు మెడికల్ చెకప్ చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాలా చిత్రం విడుదల ముందు వరకు రజని అక్కడే ఉంటారట.

కంగారు పడాల్సింది లేదు

కంగారు పడాల్సింది లేదు

ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమి లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. రజనీకాంత్ ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మెడికల్ చెకప్ కోసం వెళుతున్నారని అంటున్నారు. ఇందులో అభిమానులు ఆందోళన పడాల్సిన అంశం ఏమి లేదని, కాకపోతే రజని రాజకీయ ప్రకటన చేసిన తరువాత మీడియా హడావిడి పెరిగిందని చెబుతున్నారు.

విడుదల కావలసిన ఆ రెండు చిత్రాలు

విడుదల కావలసిన ఆ రెండు చిత్రాలు

రజనీకాంత్ నటించిన కాలా, రోబో 2.0 చిత్రాలు విడుదల కావలసి ఉంది. వీటిలో 2.0 చిత్రంపై సందిగ్దత ఇప్పటికి కొనసాగుతోంది. కాలా చిత్రం జూన్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రజని గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు.

కొత్త సినిమాకు రెడీ

కొత్త సినిమాకు రెడీ

రజనీకాంత్ రాజకీయ అరంగేట్ర ప్రకటన చేసిన తరువాత కూడా సినిమాల జోరు తగ్గడం లేదు. రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో చిత్రానికి రెడీ ఐపోతున్నారు.రజనీకాంత్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నారు. కాలా విడుదల తరువాత ఈ చిత్రం పార్రంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X