ఐష్, రజనీల ‘రోబో’ విడుదల ఎప్పుడంటే...
శివాజీ సినిమా తరువాత సౌత్ ఇండయన్ సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ ల కలయికలో అత్యాధునిక గ్రాఫిక్స్ ను వినియోగిస్తూ భారీ నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్నచిత్రం రోబో. ఇందులో ఐశ్వర్యరాయ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తారీకున రోబో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రజనీకాంత్ మరియు శంకర్ ల కాంబినేషన్ లో రెండోసారి వస్తున్నఈ సినిమా దాదాపు 135కోట్ల భారీ బడ్జెట్ రూపుదిద్దికొంటోన్న విషయం విదితమే. ఈ చిత్రం కోసం శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్ ఫోటోస్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో రజనీ రోబో గెటప్ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్, కొరియోగ్రఫీ ప్రభుదేవా చేస్తున్నారు.
రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ రోబో శంకర్ ఎఆర్ రెహమాన్ ప్రభుదేవా rajinikanth aishwarya rai robo shankar ar rahman prabhu deva


Click it and Unblock the Notifications