twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను హీరో అంటే మతిపోయింది.. ఆ ఘనత ఆ ఇద్దరిదే.. జయలలిత బోకే పంపింది.. రజనీ సంచలనం..

    By Rajababu
    |

    Recommended Video

    నేను హీరో అంటే నమ్మలేదు ! ఆ ఘనత ఆ ఇద్దరిదే..

    సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే వార్తల జోరందుకొన్న నేపథ్యంలో చెన్నైలో ఫ్యాన్స్‌తో భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్థానిక కోడంబాక్కంలోని తన సొంత రాఘవేంద్ర కల్యాణమండపంలో అభిమానులతో చర్చలు జరుపుతున్నారు. కాంచీపురం, తిరువళ్లూరు, కృష్ణగిరి, ధర్మపురి, నీలగిరి జిల్లాలకు చెందిన అభిమానులతో రజనీ సమావేశమై చర్చలు జరిపారు. తన రాజకీయ ప్రవేశంపై డిసెంబర్ 31న ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు.

    అనంతరం ఒక్కొక్కరితోను విడివిడిగా ఫోటోలు దిగారు. బాబా సినిమాలో మాదిరిగా చేతి వేళ్ల సింబల్‌ను చూపిస్తూ రజనీ కొత్త స్టయిల్‌లో కనిపించారు. తనకు అత్యంత సన్నిహితులైన సీనియర్‌ నిర్మాత కలైజ్ఞానం, దర్శక దిగ్గజం మహేంద్రన్‌తో తెల్లటి దస్తులు ధరించి వచ్చిన రజనీకాంత్ మాట్లాడుతూ..

     విలన్‌ను హీరోగా చేశాడు..

    విలన్‌ను హీరోగా చేశాడు..

    తన జీవితంపై కలైజ్ఞానం, మహేంద్రన్‌ ప్రభావం చాలా ఉంది. భైరవి చిత్రానికి ముందు విలన్‌గా నటించేవాడిని. అసలు హీరోగా నటిస్తాను అని అనుకోలేదు. కలలో కూడా ఊహించలేదు. అప్పటికి తమిళం, తెలుగు, కన్నడంలో సుమారు 15 చిత్రాల్లో నటించాను. షూటింగ్‌లకు రైళ్లు, బస్సులు, కార్లు, కొన్ని సమయాల్లో లారీల్లో కూడా వెళ్లేవాడిని అని తన మధురానుభూతులను గుర్తు చేసుకొన్నారు.

     హీరోగా నటించనని చెప్పా

    హీరోగా నటించనని చెప్పా

    అలాంటి పరిస్థితుల్లో నన్ను నిర్మాత కలైజ్ఞానం కలిశారు. నీతో సినిమా చేయాలని ఉందని చెప్పారు. అయితే విలన్‌ పాత్రే చేయాల్సి ఉంటుందని అనుకొంటుండగా నిన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలని ఉందని చెప్పారు. దాంతో నేను ఆశ్చర్యపోయాను. ఒక దశలో నేనేంటి.. హీరో పాత్ర చేయడమేంటని అనుకొన్నాను. హీరోగా నటించను అని చెప్పేశాను. అయినా నన్ను వదలకుండా నీతో ఎలాగైనా సినిమా తీస్తానని మరోసారి వెంటపడ్డాడు.

     తప్పించుకునే ప్రయత్నం చేశా

    తప్పించుకునే ప్రయత్నం చేశా

    కలైజ్ఞానం నుంచి ఎలాగైనా తప్పించుకోనేందుకు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశాను. సుమారు 30 వేలు తీసుకొనే సమయంలో రూ.50 వేలు ఇవ్వమని డిమాండ్ చేశాను. అంతే మూడు రోజుల తర్వాత పేపర్లో డబ్బుల తెచ్చి ఇవి రూ.30 వేలు. అడ్వాన్సుగా ఉంచుకో. ఆ చిత్రంలో అప్పటికే స్టార్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడని, శ్రీప్రియ హీరోయిన్ చెప్పడంతో మతిపోయింది.

     నన్ను హీరో చేసింది ఆయనే

    నన్ను హీరో చేసింది ఆయనే

    సినిమా పరిశ్రమకు ప్రముఖ దర్శకులు బాలచందర్ పరిచయం చేయగా.. నన్ను హీరో చేసింది కలైజ్ఞానం సార్‌. నేను హీరోగా నటించిన తొలి సినిమా హిట్ కావడంతో భారీ నిర్మాతలు నాతో సినిమాలు చేసేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత కలైజ్ఞానం నన్ను కలిసింది లేదు. సినిమాలు తీస్తానని చెప్పింది లేదు అని రజనీ ఉద్వేగంతో ప్రసంగించారు.

     నా నుంచి ఏమీ ఆశించలేదు

    నా నుంచి ఏమీ ఆశించలేదు

    చంటిబిడ్డ ఏడిస్తేనే తల్లి పాలు పడుతుంది. నా నుంచి ఏమీ ఆశించకుండా నా పురోగతిని చూసి సంతోషపడిన ఏకైక వ్యక్తి కలైజ్ఞానం సార్. నన్ను చూడటానికి ఇంటికి వచ్చినప్పుడల్లా ఆరోగ్యం జాగ్రత్త, మనసు అదుపులో పెట్టుకో అని చెబుతుంటారు అని ఆయన అన్నారు.

     మహేంద్రన్ చూస్తే కంగారు

    మహేంద్రన్ చూస్తే కంగారు

    ఆడుపులి చిత్ర షూటింగ్‌లో మాటల రచయిత మహేంద్రన్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన సెట్లోకి రాగానే కంగారు పడిపోయేవాడిని. గడ్డంపై చేయి పెట్టుకుని తీక్షణంగా నన్ను చూసేవారు. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం అని రజనీ చెప్పారు.

     ఆయన ఓ సింగంపులిగా

    ఆయన ఓ సింగంపులిగా

    ఎప్పుడైనా నేను దర్శకుడిగా మారితే నువ్వే హీరో అని మహేంద్రన్ చెప్పేవాడు. ఆయన దర్శకత్వం వహించిన ముల్లు మల్లరుమ్‌లో హీరోగా నటించాను. ఆ సెట్లో నాకు సన్నిహితంగా ఉన్న మహేంద్రన్‌ వేరు, దర్శకుడిగా మారిన మహేంద్రన్‌ వేరు. పనిలో ఉన్నప్పుడు సింగంపులిగా కనిపించేవాడు. ఆయన ఒక్క షాట్‌‌కు ఓకే చెప్పేలోపు నా ప్రాణం పోయేది.

     నటన నేర్పింది వారిద్దరే

    నటన నేర్పింది వారిద్దరే

    నేను ఏది చేస్తే అదే యాక్టింగ్ అనుకొనే వాడిని. నాకు స్టయిల్ నేర్పింది మహేంద్రన్‌ గారు. బాలుమహేంద్ర, మహేంద్రన్ నటన అంటే ఏంటో నాకు నేర్పించారు.

     రజనీ కాళీలా ఉంటాడు..

    రజనీ కాళీలా ఉంటాడు..

    మనముందు చెప్పే మాటల కన్నా వెనుక మాట్లాడుకునేవే బుర్రలో ఉంటాయి. ఎప్పుడూ వారిద్దరూ నా గురించి మాట్లాడుకునే వాళ్ళు. రజనీ కాళిలా ఉంటాడు. అతని నడక ఓ డిఫరెంట్ అని చెప్పుకొనేవారు.

     బాలచందర్ లేఖ రాశారు..

    బాలచందర్ లేఖ రాశారు..

    ముల్లుమ్‌ మలరుమ్‌ చిత్రం చూసిన తర్వాత బాలచందర్‌ నాకు లేఖ రాశారు. సినిమా పరిశ్రమకు నిన్ను పరిచయం చేసినందుకు చాలా గర్వంగా ఉంది. నా తండ్రి లాంటి బాలచందర్ ప్రశంసను నేను ఎప్పడూ మరిచిపోలేను.

    జయలలిత బోకే పంపారు..

    జయలలిత బోకే పంపారు..

    ముల్లుమ్‌ మలరుమ్‌ చిత్రాన్ని చూసిన తర్వాత జయలలిత మా ఇంటికి ఫ్లవర్ బోకేను పంపింది. ‘ఎక్స్‌లెంట్‌ పెర్ఫార్మెన్స్‌, కంగ్రాచ్యులేషన్స్‌' పొగడ్తలతో ముంచెత్తింది. నేను గొప్ప హీరోగా ప్రేక్షకుల చేత అనిపించుకొంటున్నానంటే ఆ ఘనత మహేంద్రన్, కలైజ్ఞానం సార్‌‌దే అని అన్నారు.

    English summary
    Superstar Rajinikanth is beginning his six day meet with his fans December. This is the Superstar's second such meet. He is holding the meet in T Nagar in Chennai. Thalaivar said in his speech that he will take decision about him joining politics on December 31st. In this event, Rajinikanth reveal key incidents of his cinema career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X