సూపర్ స్టార్ ఇచ్చిన విందుకు మురిసిపోయిన అతిరధమహారధులు..
రజనీకాంత్ కు ఈ నెల 12వ తేదీతో 60 ఏళ్లు పూర్తి అయిన సందర్బంలో రజనీ, లత దంపతులకు షష్టిపూర్తి వేడుకను జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించడం, రజనీ షష్టిపూర్తి వేడుక పదో తేదీన చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో ఉన్న వారి స్వగృహంలో ఆడంబరంగా జరగిన విషయం అందరికి తెలిసిందే. రజనీకాంత్, లత దంపతుల షష్టిపూర్తికి చెన్నయ్ లోని ఇంట్లో జరగ్గా దీనికి కుటుంబ సభ్యులు బందువులు మాత్రమే హాజరయ్యారు. చిత్ర పరిశ్రమ తరుపున బాల చందర్, కమలహాసన్ మాత్రమే వెళ్లి శుభాకాంక్షలు అందచేసారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ తన షష్టిపూర్తిని పురస్కరించుకొని సినీ ప్రముఖులు, స్నేహితులకు, ఆదివారం చెన్నయ్ లో విందు ఏర్పాటు చేసారు. ఈ నేపధ్యం లో ఆదివారం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య మంత్రి కరుణానిధి, దయానిధి మారన్, మోహన్ బాబు, పార్తిబన్, దర్శకుడు రాజా, జయం రవి, భాను ప్రియ, దర్శకులు ఎస్వి ముత్తురానమ్, కేఎస్ రవికుమార్, లింగు స్వామి, వైరముత్తు, నిర్మాతలు ఎస్.దాను, రామ నారాయణ్, తోట తరణి తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











