శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రజనీకాంత్ సినిమానా?

By Srikanya

ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ చిత్రాలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తాజాగా రామానాయుడు మనవడు రాణాని హీరోగా పరిచయం చేస్తూ లీడర్ చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని రజనీకాంత్ తో రీమేక్ చేయనున్నారనే వార్తలు అంతటా వినపడుతున్నాయి. ఇది కావాలని సినిమా ప్రమేషన్ కోసం చేస్తున్న ప్రచారం అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే తమిళ పత్రికలు మాత్రం లీడర్ చిత్రాన్ని రూపొందిస్తున్న ఎవియం స్టూడియోస్ వారు చిర కాల విరామం తర్వాత రజనీకాంత్ కి ఈ క్రేజీ ప్రాజెక్టు వివరాలు, కథ చెప్పారని ఆయన ఇంప్రెస్ అయ్యారని చెప్తున్నారు. అయితే అఫీషయల్ గా మాత్రం ఎక్కడా న్యూస్ రాలేదు. అంతేగాక రజనీకాంత్ ని డైరక్ట్ చేసేది శేఖర్ కమ్ముల అని ప్రకటిస్తున్నారు. పొలిటకల్ ఇష్యూలను బేస్ చేసుకుని శేఖర్ ఈ కథ అల్లినట్లు సమాచారం. ఇందులో హిరో..ఎన్నారై.ఓ ముఖ్యమంత్రి కుమారుడు. తన తండ్రి హఠాత్తుగా మరణించటంతో తాను ఆ ఫీఠం ఎక్కి ఎలా రాజకీయాలను మార్చాడన్నది కధాంశం అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను కొంత పోలి ఉండటంతో అంతటా మంచి టాక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రాణా తన తర్వాత సినిమాకు ఆనంద్ రంగాను దర్శకుడుగ ఎంచుకున్నారు. ఆనంద్ రంగా ఇంతకు ముందు సిద్దార్ధతో ఓయ్ చిత్రాన్ని రూపొందిచారు. సినిమా ఫ్లాఫ్ అయినా బాగా తీసాడన్న పేరును దర్శకుడుకి మిగల్చింది. ఇక ప్రస్తుతం రజనీకాంత్ ..శంకర్ దర్శకత్వంలో రోబో చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన ఐశ్వర్యా రాయ్ నటిస్తోంది. జెడి చక్రవర్తి విలన్ గా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X