హాట్ టాపిక్: సూపర్ స్టార్ సిక్స్ ప్యాక్ పోస్టర్

By Srikanya

ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన కూతురు సౌందర్య తన ట్విట్టర్ లో ఓ ఫోటోని పెట్టి పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్లితే..రజనీకాంత్‌ హీరోగా 'కొచ్చాడయాన్‌' అనే త్రీడీ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన సరసన బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణే నటించబోతోంది. గతంలోనే వీరిద్దరూ కలిసి 'రాణా' చిత్రంలో నటించాల్సి ఉన్నా.. రజనీ ఆరోగ్యం బాగోలేక ఆ సినిమాను ఆపేశారు.

తాజా చిత్రాన్ని రజనీ తనయ సౌందర్య తెరకెక్కిస్తోంది. ఆమె ట్విట్టర్‌లో ఈ సినిమా గురించి రాస్తూ దీపికను హీరోయిన్ గా ఎంచుకొన్నట్లు వెల్లడించారు. మోషన్‌ క్యాప్చర్‌ పరిజ్ఞానంతో 'కొచ్చాడయాన్‌' తెరకెక్కబోతోంది. శరత్‌ కుమార్‌ ఓ కీలక పాత్రలో నటిస్తారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. ఒక దశలో కత్రినాకైఫ్‌ నాయికగా నటిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే చివరకు అవకాశం దీపికనే వరించింది. 'రాణా'లో అవకాశం చేజారినా.. మళ్లీ 'కొచ్చాడయాన్‌' రూపంలో రావడంతో దీపిక ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో రజనీ సిక్స్ ప్యాక్ తో కనిపించి తన అభిమానులను ఆనందపరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X