రజనీకాంత్ ‘రాణా’ తర్వాత రోబో చిట్టి మళ్లీ మనముందుకు...!?
ఇండియన్ జేమ్స్ కామెరూన్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో కళానిధి మారన్ నిర్మించిన 'రోబో" సెన్సేషనల్ హిట్ అయి అశేష ప్రేక్షకులను అలరించింది. అంచనాలకు మించి కలెక్షన్ల కనకవర్షాన్ని కురిపించింది. బాలీవుడ్ చిత్రాల సరసన చోటు దక్కించుకుంది. మనిషి మేథస్సును పదునుపెట్టే విజ్ఞాన, సైంటిఫిక్ చిత్రం రోబో. ఈ రోబోలో చిట్టి పాత్ర సూపర్బ్ గా చిత్రీకరించిన విషయం తెలిసిందే. 2010 సంత్సరానికి గాను ఈ ఏటి మేటి చిత్రం ఖచ్చితంగా రోబో అయింది. ఇలాంటి కొత్తదనం గల చిత్రం రోబో2గా మళ్లీ మనముందుకొస్తే...
కాగా రజనీకాంత్ ఇటీవల కళానిధి మారన్, కలిసి కాసేపు చర్చలు జరిపారట. ఆ సమయంలో 'రోబో 2" చేస్తే ఎలా ఉంటుంది? అని రజనీకాంత్ అన్నట్టు, స్వయంగా రజనీకాంతే అడగడంతో కళానిధి మారన్ కూడా 'రోబో 2" నిర్మించడానికి సుముఖంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ 'రాణా" చిత్రం అంగీకరించిన విషయం తెలిసిందే. మరోవైపు శంకర్ '3ఇడియట్స్" రీమేక్ 'నన్బన్" తో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరూ తమ చిత్రాలు పూర్తయిన తర్వాత 'రోబో 2" ఆరంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











