3డీ కి కన్వ్రర్ట్ చేస్తున్న రజనీ మరో సూపర్ హిట్
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలుకు ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్. ఆ సినిమాలు ఎన్ని సార్లు రిపీట్ రిలీజ్ లు ఉన్నా జనం ఎగబడి చూస్తారు. అలాంటిది ఆ సినిమాని త్రీడి కి కన్వర్ట్ చేసి వదిలితే భాక్సాఫీస్ బ్రద్దలు అవుతుంది. ఇప్పుడిదే కమర్షియల్ ఫార్ములతో రనజీకాంత్ సూపర్ హిట్ చిత్రం శివాజీని మారుస్తున్నారు.
'సింహం సింగిల్‌గా వస్తుంది'.. అంటూ 'శివాజి' చిత్రంలో ప్రేక్షకులను అలరించారు రజనీకాంత్. శంకర్ దర్శకత్వంలో 2007లో వచ్చిందీ చిత్రం. ఏవీఎమ్ సంస్థ నిర్మించింది. రజనీ సరసన శ్రియ నటించింది. త్వరలో 'శివాజి'ని 3డీలో చూపించబోతున్నారు.
2డీ పరిజ్ఞానంతో చిత్రించిన ఈ సినిమాను ఇప్పుడు త్రీడీలోకి మారుస్తున్నారు. చెన్నైలోని ప్రసాద్ ఈఎఫ్‌ఎక్స్‌లో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. 2డీలోని 'టైటానిక్'ని త్రీడీలోకి తీసుకొచ్చిన తరవాత ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం మొదలైంది. 'శివాజి'కి సంబంధించిన పనులను గతేడాది మొదలుపెట్టారు. అక్టోబరులో 3డీ సినిమా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న 'విక్రమసింహ'ను మోషన్ క్యాప్చర్ విధానంలో చిత్రిస్తున్నారు. ఇదీ త్రీడీ సినిమాయే. ఇది డిసెంబరులో విడుదలవుతుంది.
తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న 'కోచడయాన్' చిత్రం తెలుగు వెర్షన్‌కి 'విక్రమసింహా' అనే పేరును ఖరారు చేశారనేది విశ్వసనీయ సమాచారం. ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపంచనున్నారు. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
రజనీకాంత్ చిత్రం గురించి మాట్లాడుతూ...''ఈ సినిమాకు సంబంధించి చాలా ఊహాశక్తి, మైమింగ్ అవసరముంటుంది. ఇది అనుకున్నంత సులభం కాదు. మోషన్ టెక్నాలజీతో షాట్స్ తీయడం ఒక సవాల్ ... ఇదొక టఫ్ జాబ్ అన్నారు. అలాగే ఈ చిత్రం రజనీ అభిమానులకు 'కొచడైయాన్' ఒక విందులాంటిదని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ అందరి మన్ననలు పొందుతోంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల 12 సెకెండ్ల నిడివి గల ఒక వీడియోను కూడా ఆవిష్కరించారు. రజనీకాంత్, శరత్‌కుమార్, నాజర్‌లతో కూడిన దృశ్యాలను ఇందులో పొందుపరిచారు. చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, శోభన, రుక్మిణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











