ఆ హీరోనే గ్రేట్..ఆయనే రోల్ మోడల్...శ్రియ
శ్రియ తన లేటెస్ట్ గా తమిళ చిత్రం శివాజి చిత్రం హిందీలోకి డబ్బింగ్ జరుపుకుంటున్న సందర్భంగా మీడియాని కలిసినప్పుడు తనకు నచ్చిన హీరో గురించి చెప్పుకొచ్చింది. ఆయన మరెవరో కాదు రజనీకాంత్. ఆయనతో శ్రీయ శివాజి చిత్రం చేసింది. ఆ విషయాలు గుర్తు చేసుకుంటూ "సూపర్‌స్టార్ అయినప్పటికీ ఆయన సింప్లిసిటీ చూసినప్పుడు 'గ్రేట్' అన్పిస్తుంటుంది. అలాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన ఎందరికో 'రోల్‌మోడల్' అని చెప్పొచ్చు' అన్నారు శ్రియ. రజనీతో చేయడం జీవితంలో మరచిపోలేని అనభూతిగా అంటోందామె. ఉషాకిరణ్ వారి 'ఇష్టం' సినిమాతో తెలుగువారికి పరిచయమైనతాను అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేసినా.. రజనీకాంత్‌తో చేసిన 'శివాజి'నే గుర్తుకు వస్తుందని చెప్తోంది. శివాజి సినిమా తనకు జాతీయంగా, అంతర్దాతీయంగానూ ఎంతో గుర్తింపు తెచ్చిందవి మురిసిపోతోంది. అలాగే ఈ చిత్రం ఇప్పుడు హిందీలో అనువాదమవుతోంది. ఈ అనువాద చిత్రంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు శ్రియ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెబుతూ- "నా కేరక్టర్‌కు నేనే డబ్బింగ్ చెప్పాను. చాలా బాగా వచ్చింది. ఇక సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అసలు ఇంతవరకూ 'శివాజి' హిందీలో ఎందుకు అనువాదం కాలేదు అన్నది ఆశ్చర్యంగా వుంది' అన్నారు.ఇక శ్రియ ఏ చిత్రంకి పనిచేస్తూంటే ఆ హీరో గురించి గొప్పగా చెప్తూండటం మామూలేనని, ఇంతకు ముందు కూడా తమిళ, హిందీ పరిశ్రమలలో అందరి హీరోలను ఎత్తేసిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











