‘సుల్తాన్ ది వారియర్’ ప్లాప్ కాకుండా క్యాష్ చేసుకునేందుకు రజనీ జిత్తులు
'రోబో" ఘన విజయం సాధించడంతో దీనికి ఫాలో అప్ గా రిలీజయ్యే తన యానిమేషన్ సినిమాకి కమర్షియల్ ప్లాట్ ఫామ్ ని రజనీకాంత్ సెట్ చేస్తున్నారు. కూతురు సౌందర్య నిర్మిస్తున్న యానిమేషన్ సినిమా ప్లాప్ కాకూడదని గొప్ప స్కెచ్ రెడీ చేసుకున్నారు. యానిమేషన్ సినిమా అంటే దక్షిణాది సినీ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు కనుక ఈ చిత్రాన్ని హిట్ చేసేందుకు తనే రంగంలోకి దిగుతున్నరు. యానిమేషన్ సినిమా అయినా తనొక అరగంట పాటు తెరపై కనిపించేలా కథలో మార్పుచేర్సులు చేయించుకున్నారు.
తాను నటించే ఆ భాగాన్ని డైరెక్ట్ చేయవలసిందిగా కెఎస్ రవికుమార్ ని రజనీకాంత్ కోరారు. అంతే కాకుండా 'సుల్తాన్ ది వారియర్" అనే టైటిల్ మార్చి మాస్ కి నచ్చేలా'హరా" అని కొత్త పేరు పెట్టించారు. ఇదంతా రోబో రిలీజయిన తర్వాతే జరగడం చూస్తే కూతురు నిర్మిస్తున్న సినిమా ప్లాప్ కాకూడదనే ఉద్దేశంతో రజనీ ఇంతగా పరితపిస్తున్నారని, రోబో తర్వాత వచ్చే తన సినిమాపై ఉండే ఆసక్తిని అనుకూలంగా మర్చుకుంటున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


Click it and Unblock the Notifications











