రజనీకాంత్‌ కాన్స్‌ పర్యటన రద్దు

By Srikanya

చెన్నై : రజనీకాంత్‌ కాన్స్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఎర్ర తివాచీపై నడుస్తారని అభిమానులంతా ఎదురుచూశారు. ఆయన నటించిన 'కోచ్చడయాన్‌'కి సంబంధించిన ప్రచార చిత్రాల్ని కాన్స్‌లో విడుదల చేయాలని భావించారు.

అందుకోసం రజనీ అక్కడికి వెళ్తారని చెన్నై సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు ఆయన కాన్స్‌ పర్యటన రద్దయింది. 'కోచ్చడయాన్‌'కి సంబంధించిన ప్రచార చిత్రాల రూపకల్పన ఇంకా పూర్తి కాకపోవడం వల్లే కార్యక్రమం రద్దు చేసుకొన్నారు.

ఈ విషయమై దర్శకురాలు సౌందర్య ట్వీట్ చేస్తూ... ''ప్రచార చిత్రం అందర్నీ ఆశ్చర్యపరచేలా రూపొందుతోంది. త్వరలోనే అందరికీ చూపిస్తా ము''అని ట్విట్టర్‌లో వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలో ప్రచార చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కోచ్చడయాన్‌'. ఆయన రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో 'విక్రమసింహ'గా రూపుదిద్దుకుంటోంది. దీపికా పదుకొనే హీరోయిన్.

ఇక ఈ చిత్రం 'కోచ్చడయాన్‌' అనే యోధుడు కథ ని తెలుపుతుంది. ఈ చిత్రంలో రజనీ...ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది వందశాతం రజనీ ఫార్ములా చిత్రం అని చెప్తున్నారు. ఈ చిత్రం కథ గురించి ఆయన కుమార్తె సౌందర్య మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే... ఇందలో ఇద్దరు రజనీలు ఉంటారు.

ఇందులో సీనియర్‌ రజనీయే 'కోచ్చడయాన్‌'. ఆయనో దళపతి. తమ దేశపు రాజుకు కోచ్చడయాన్‌ మంచి స్నేహితుడు. ఆ మిత్రుడి కోసం ప్రపంచాన్నే జయించి.. ఆ విజయాన్ని రాజుకు సమర్పించాలని ఉత్సాహపడే సైనికుడు. అంతేకాదు.. కోచ్చడయాన్‌ భరతనాట్య కళాకారుడు కూడా. యుద్ధంలో ఆక్రోశంగా, వీరోచితంగా పోరాడే కోచ్చడయాన్‌.. వెనువెంటనే అందమైన అభినయంతో నృత్యం చేస్తారు. అలాంటి పాత్రకు ఎవర్ని హీరోయిన్ గా తీసుకుందామా.. అని ఆలోచించాం. అప్పుడు మా అందరికీ తోచిన పేరు శోభన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X