హాస్పటిల్ లో జాయిన్ అయిన రజనీకాంత్ అల్లుడు
రజనీకాంత్ అల్లుడు తమిళ హీరో ధనుష్ చెన్నైలోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు. ఎప్పుడూ ఉషారుగా ఉండే ధనుష్ గత నాలుగు రోజులుగా హై ఫీవర్ తో భాధపడుతున్నారు. ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ ఇస్తున్నా డాక్టర్లు హాస్పటిల్ లో అయితే మెడికల్ ఫెసిలిటీస్ మరింత అందుబాటులో ఉంటాయని చెప్పటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుబుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన రజనీకాంత్ రెండో కూతరు రిసెప్షన్ కి ధనుష్ హాజరు కాలేదు. ఇక ధనుష్ జ్వరం తగ్గుముఖం పట్టినా శరీరం నీరసం నుంచి కోలుకోవటానికి రెండు మూడు రోజులు పట్టవచ్చని, అప్పటివరకూ హాస్పటల్ లో ఉండటం మేలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇక ధనుష్ అభిమానులు ఈ విషయం తెలుసుకుని హాస్పటిల్ కి వస్తూండటంతో వారిని రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్..మాఫిళ్ళై రీమేక్ లో నటిస్తున్నారు. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మనీషా కొయరాల ధనుష్ అత్తగారిగా, హన్సిక తల్లిగా చేస్తోంది.


Click it and Unblock the Notifications











