టాలీవుడ్ హీరోలతో రజినీకాంత్ బాక్సాఫీస్ ఫైట్.. అదే డేట్ కావాలట!
సూపర్ స్టార్ రజినీకాంత్ ఎనర్జీ ఏమిటో గాని గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఏడు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా ఏ మాత్రం స్పీడ్ తగ్గడం లేదు. కుర్ర హీరోలకు ధీటుగా తలైవా తన సినిమా షూటింగ్స్ ని పూర్తి చేస్తున్నాడు. అయితే ఇటీవల ఈ స్టార్ హీరో తన నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడట. తెలుగులో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలు తెలుగులో కూడా భారీ స్థాయిలో వసూళ్లను అందుకునేవి. కానీ రోబో అనంతరం సూపర్ స్టార్ అంచనాలకు తగ్గట్టుగా మెప్పించలేకపోతున్నాడు. ఎన్ని సినిమాలు చేసినా కూడా వరుసగా డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోతున్నాయి. దాదాపు రజినీకాంత్ తెలుగు మార్కెట్ పడిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ శివ దర్శకత్వంలో అన్నాతె సినిమాతో మాత్రం ఖచ్చితంగా తెలుగులో కూడా సక్సెస్ అందుకోవాలని ఫిక్స్ అయ్యారట.

అందుకే సంక్రాంతిని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2021 సంక్రాంతి కోసం చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. ఇక రజినీకాంత్ కూడా అదే డేట్ కి తెలుగు ఆడియెన్స్ ని తనవైపుకు తిప్పుకోవలని ప్లాన్ వేస్తున్నారట. అన్నతె దర్శకుడు శివ కొన్ని సన్నివేశాల్ని తెలుగు ఆడియెన్స్ కి నచ్చే విధంగా డిజైన్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ దర్శకుడు తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేశాడు. ఆ తరువాత అజిత్ తో కలిసి వరుసగా నాలుగు సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. మరి రజినీకాంత్ కి ఈ దర్శకుడు ఎలాంటి హిట్టిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











