రజనీకాంత్ మొదటి పెళ్లిపిలుపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ..
రజనీకాంత్ మంచి నటుడు, మంచి వ్యక్తి మాత్రమే కాదు. మంచి భర్త, మంచి తండ్రి, మంచి తాత కూడా, తన ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురు వివాహం హీరో ధనుష్ కిచ్చి జరిపించిన రజనీ, చిన్న కుమార్తె వివాహాన్ని వచ్చేనెల 3వ తారీఖున చెన్నయిలో జరిపించనున్నాడు. అయిదారు నెలల క్రితం నిశ్చితార్థాన్ని నిరాడంబరంగా జరిపించిన రజనీ, పెళ్లి మాత్రం అత్యంత ఘనంగా చేసేందుకు గత కొన్ని నెలలుగా సన్నాహాలు చేసుకుంటూనే ఉన్నారు.
అందులో మొదటి ఇన్ విటేషన్ కాంగ్రెసు ప్రెసిడెంట్ సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీకి రెడీ అయిందని సమాచారం. తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్, అబిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ ముఖ్య అథిదులుగా పిలువడానికి రజనీయే స్వయంగా వెళ్ళి పిలువనున్నారు.
తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషలకు చెందిన ప్రముఖ తారలతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన రాజకీయ ప్రముఖులంతా విచ్చేసి వధూవరులను ఆశీర్వదిస్తారు కనుక, అందుకు తగ్గట్టుగా ఏర్సాట్లు చేసేందుకు రజనీ దంపతులు తలమునకలుగా ఉన్నారు. ఇప్పటికే ఫోనులో ఆత్మీయులందరకీ పెళ్లి కబురు చెప్పిన రజనీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను స్వయంగా కలిసి శుభలేఖలను అందచేస్తున్నారని సమాచారం.
రజనీ నటించిన 'రోబో" (తమిళంలో 'ఎందీరన్") సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంతరించుకున్న ఈ చిత్రం రజనీ కుమార్తె పెళ్లి పేరు చెప్పి మరింత ప్రచారాన్ని సాధించి, మరిన్ని అంచనాలు పెంచనుంది.


Click it and Unblock the Notifications











