వావ్ ఈ ఫ్రేమ్ అదిరింది.. చాలా రోజుల తరువాత తలైవాతో కమల్ హాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ మరికొన్ని రోజుల్లో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో చేసినటువంటి విక్రమ్ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుంది అని ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.
Recommended Video

ఈ సినిమాలో కమల్ హాసన్ మాత్రమే కాకుండా మరికొంత మంది అగ్ర నటులు కూడా ముఖ్యమైన పాత్రలో నటించడం సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. విజయ్ సేతుపతి అలాగే ఫాహాద్ ఫాజిల్ కూడా సినిమాలో కమల్ హాసన్ కు దీటుగా నటించినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో ప్రముఖ నటుడు సూర్య కూడా ఒక ప్రత్యేకమైన అతిథి పాత్రలో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు గా ఇటీవల చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

ఇక విక్రమ్ సినిమా పై పెరుగుతున్న పాజిటివ్ వైబ్రేషన్ పై తలైవా కూడా చిత్ర యూనిట్ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ స్వయంగా రజినీకాంత్ దగ్గరికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఇక రజనీకాంత్ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని తన మిత్రుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇండస్ట్రీ లో ఎవరు ఎలా ఉన్నా కూడా రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ చాలా మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు అని చెప్పవచ్చు. ఇక త్వరలోనే కమలహాసన్ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా రజనీకాంత్ కూడా విక్రమ్ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. అంతే కాకుండా వారు ప్రత్యేకంగా కలిసి దిగిన ఒక ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక త్వరలోనే రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా తలైవా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











