twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌.. నిర్ణయం మార్చుకో: రజనీకాంత్‌

    By Srikanya
    |

    చెన్నై : విశ్వరూపం చిత్రం విషయమై సినీ పరిశ్రమ మొత్తం కమల్ వెనక నిలబడింది. తమిళనాడును విడిచిపోతానన్న కమల్‌హాసన్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌లు కోరారు. సినిమా రంగానికే తన జీవితాన్ని అర్పించుకున్న కమల్‌ను క్షోభపెట్టటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని విజయకాంత్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

    రజనీకాంత్‌ కూడా కమల్‌హాసన్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించి, తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇక కమల్‌ ప్రకటన విన్న వెంటనే సినీ రంగానికి చెందిన భారతిరాజా, మణిరత్నం, గేయ రచయిత వైరముత్తు, నటులు శివకుమార్‌, అరవింద్‌స్వామి, కార్తీ, సూర్య, శింబు, రాధిక, స్నేహ తదితరులు కమల్‌ నివాసానికెళ్లి ఆయన్ను ఓదార్చారు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని, తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నినాదాలు చేశారు.

    సెన్సార్‌బోర్డు అధ్యక్షులు లీలా శామ్సన్‌, సినీ ప్రముఖులు నాగార్జున, శ్యాంబెనగల్‌, మహేశ్‌భట్‌, షారుఖ్‌ఖాన్‌, సిద్ధార్థ్‌, ప్రకాష్‌రాజ్‌, మాధవన్‌, నాని తదితరులు సంఘీభావం ప్రకటించారు. కమల్‌హాసన్‌కు కేంద్రప్రభుత్వం కూడా అండగా నిలిచింది. దేశంలో ప్రతి ఒక్కరూ భావప్రకటనా స్వేచ్ఛను కలిగిఉన్నారనీ, కళాకారులు తమకు నచ్చిన పనిచేసుకోవడంలో స్వేచ్ఛను కలిగి ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు.

    నిషేధం ప్రకటన తరువాత పలువురు సినీ ప్రముఖులు కమల్‌కు సంఘీభావం తెలిపారు. ముందుగా యాక్షన్‌హీరో అర్జున్ స్పందించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫోన్‌లో కమల్‌తో మాట్లాడారు. సీనియర్ నటుడు రాధారవి, ప్రభు, విజయకుమార్, ఉదయనిధి స్టాలిన్, కవి పేరరసు వైరముత్తు, ఖుష్బూ, రాధిక, సత్యరాజ్, అరవింద్‌సామి, ప్రసన్న, స్నేహ, కార్తి, శివకుమార్, శింబు తదితరులు కమల్ ఇంటికి స్వయంగా వచ్చి పరామర్శించారు. దర్శకుడు అమీర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, కమల్ దేశం వదిలి వెళ్లాలన్న ఆలోచనను మానుకోవాలని కోరారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సామరస్యంగా స్పందించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

    English summary
    
 Ajith voices support for Vishwaroopam. While the Tamil film industry has stood silent over the ban on Viswaroopam, some of the stars have raised their voice against it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X