సూపర్ స్టార్ రజనితో మురుగదాస్ నెక్స్ట్ మూవీ!
క్రేజీ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరో కోరుకుంటాడు. అలాంటి దర్శకుడుతో సాక్షాత్తు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. రజనీకాంత్ తో మురుగదాస్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మురుగదాస్ విజయ్ తో సినిమా చేస్తున్నాడు.
అన్ని కుదిరితే ఈ దర్శకుడి తదుపరి చిత్రం రజనీకాంత్ తోనే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇప్పట్లో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కనిపించడం లేదు. కాలా చిత్రం విడుదలైన వెంటనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోని చిత్రాన్ని రజని ప్రారంభించేశాడు.

తమిళనాడు ఎన్నికలు సమీపించే లోపు వీలైనన్ని చిత్రాల్లో నటించాలని సూపర్ స్టార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మురుగదాస్ రజనికి కథ వినిపించారని, కార్తీక్ సుబ్బరాజ్ చిత్రం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











