సూపర్ స్టార్ పెట్టిన టైటిల్ ఫర్ ఫెక్ట్ మ్యాచ్..ఫర్ ఫెక్ట్ పబ్లిసిటీ..!
తమిళ దర్శకుడు పి.వాసు తీస్తున్న తాజా చిత్రానికి ఇప్పుడు మంచి ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది. ఎందుకంటే, ఆ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ భాగస్వామ్యం కూడా వుంది. ఎలా ఆంటే, ఆ సినిమాకి టైటిల్ పెట్టింది రజనీయేనట! అసలు విషయంలోకి వస్తే.... రజనీకి, దర్శకుడు వాసూకి మధ్య మంచి స్నేహబంధం వుంది. ఇరవై ఏళ్ల క్రితం వీరిద్దరూ కల్సి చేసిన 'మన్నన్' (తెలుగులో 'ఘరానా మొగుడు') సినిమా అప్పటి నుంచీ ఆ స్నేహం కొనసాగుతోంది. అందుకే, తనకేమాత్రం వీలు చిక్కినా వాసు దగ్గరకెళుతుంటారాయన.
అలాగే, ఈమధ్య ఓసారి వెళ్లినప్పుడు.. తను తీస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఫైనల్ చేస్తున్నారట వాసు. పులివేషం, ఆర్భాటం, మరియు ముగమూడి అనే మూడు పేర్లు అనుకుని వాటిలో ఏది పెట్టాలన్న డైలమాలో పడ్డారు వాసు. అప్పుడు రజనీ ఆ సినిమా కథ విని, 'పులి వేషం' టైటిల్ బాగుంటుందని సూచించారట. దాంతో వాసూతో బాటు అక్కడున్న వారంతా 'సూపర్' అంటూ ఆ టైటిల్ కే వోటేశారట. అంతే కాదు రజనీ కాంత్ పెట్టిన పేరు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయిందని, రజనీ ఒక్కసారి జరిగితే వందసార్లు జరిగినట్టే అందుకే, రజనీ పెట్టిన టైటిల్ గా ఈ సినిమాకి పబ్లిసిటీ వస్తోంది!!


Click it and Unblock the Notifications











