twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్: దాని కోసం 45 రోజులు ఇక్కడే బస

    |

    సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో తనదైన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. వయసు మీద పడుతున్నా కుర్రాళ్లక పోటీగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఆయన.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావానికి తోడు అనారోగ్య కారణాలతో ఈ సినిమా షూటింగ్‌కు చాలా రోజుల పాటు బ్రేక్ వచ్చింది. ఈ మధ్య పున: ప్రారంభించాలని అనుకున్నా.. దర్శకుడు శివ తండ్రి మరణించడంతో మరోసారి ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'అన్నత్తే' షూటింగ్ డిసెంబర్ 14 నుంచి మొదలు కాబోతుందని తెలుస్తోంది. 45 రోజుల పాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సాగే ఈ షెడ్యూల్ కోసం రజినీకాంత్ త్వరలోనే నగరానికి రానున్నారని సమాచారం. కొద్ది రోజుల పాటు షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే డిసెంబర్ చివర్లో ఆయన తిరిగి చెన్నై వెళ్లనున్నారు. డిసెంబర్ 31న కొత్త పార్టీని ప్రకటించి, జనవరి 1 నుంచి దాన్ని ప్రారంభిస్తానని సూపర్ స్టార్ ఇప్పటికే వెల్లడించారు. దీని కోసమే షూటింగ్‌కు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    Rajinikanth to come Hyderabad for Annaatthe Shoot

    ఇదిలా ఉండగా, అజిత్ కుమార్‌తో 'వీరం', 'వేదాళం' వంటి పవర్‌ఫుల్ సినిమాలు తీసిన శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తే'పై భారీ అంచనాలే ఉన్నాయి. సూపర్ స్టార్ స్టామినాకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడట దర్శకుడు. ఇందులో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, సీనియర్ హీరోయిన్ మీనా, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

    English summary
    Shivaji Rao Gaekwad, known professionally as Rajinikanth, is an Indian actor who works primarily in Tamil cinema. In addition to acting, he has also worked as a producer and screenwriter. He has won many awards, including four Tamil Nadu State Film Best Actor Awards and a Filmfare Best Tamil Actor Award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X