»   » అఖిల్ అక్కినేని ఇంట్రడ్యూస్ చేయబోతున్న రజనీకాంత్

అఖిల్ అక్కినేని ఇంట్రడ్యూస్ చేయబోతున్న రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన కుమారుడు అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అవుతున్న నేపథ్యంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అఖిల్ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అఖిల్ సినిమా విషయంలో భారీ హైప్ తేవడంలో నాగార్జున సక్సెస్ అయ్యారు.

మరో వైపు తమిళ ప్రేక్షకులకు కూడా అఖిల్ పరిచయం అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. తన కుమారుడు నటిస్తున్న ‘అఖిల్' సినిమాను తమిళంలో కూడా అనువదించి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ ప్రేక్షకులకు అఖిల్ ను పరిచయం చేసే కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ ద్వారా అఖిల్ తమిళ ప్రేక్షకులకు పరిచయం అయితే తమిళ మార్కెట్లో అఖిల్ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు అఖిల్ సినిమా తమిళ రైట్స్ దక్కించుకున్నసి.కళ్యాణ్ రజనీకాంత్ ఆహ్వానించినట్లు సమాచారం.

Rajinikanth To Introduce Akhil Akkineni In Tamil

ప్రస్తుతం రజనీకాంత్ తమిళ చిత్రం ‘కబలి' చిత్రం షూటింగులో బిజీగా గడపుతున్నారు. అయితే రజనీకాంత్ వచ్చే విషయం ఖరారు కావాల్సి ఉంది. రజనీకాంత్‌కు ఎప్పుడు వీలైతే అప్పుడే ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అక్టోబర్ 22న తెలుగుతో పాటు తమిళంలో ‘అఖిల్' సినిమా విడుదల కాబోతోంది.

అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
If the industry grapevine is anything to go by, superstar Rajinikanth will introduce Akhil Akkineni to Tamil industry at an event in Chennai early next month. Akhil's debut film titled Akhil, which will be dubbed and released in Tamil too, will have a simultaneous release in Tamil as well on October 22.
Please Wait while comments are loading...