twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ బర్త్ డే నేడు..‘స్టయిలిస్ డే’ కోసం డిమాండ్

    By Bojja Kumar
    |

    ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రజనీ స్టైల్స్‌, డైలాగ్స్‌ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసి పెట్టాయి. ఒక్క డైలాగ్‌ చెబితే వందసార్లు చప్పట్లు కొట్టాల్సిందే. అదీ రజనీ స్టైల్‌ తమిళ, తెలుగు, హిందీ... ఇలా భాషలతో సంబంధం లేకుండా అందరిచేత శభాష్‌ అనిపించుకున్న నటుడాయన.

    తమ స్టయిలిష్ హీరో...పెట్టిన రోజును 'స్టయిలిస్ డే'గా ప్రకటించాలని రజనీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు ప్రకటించినా, ప్రకటించిక పోయినా...ఇకపై ఈ రోజుకు స్టయిలిస్ డేగా జరుపుకుంటామని, స్టయిలిష్ డేను సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రచారంలోకి తెస్తానని అంటున్నారు.

    రజీనీ ఫిల్మో గ్రఫీ...
    1949 డిసెంబర్‌ 12న కర్నాటకలో మరాఠా దంపతులకు జన్మించిన రజనీ... తల్లి పేరు జిజియాబాయ్‌. తండ్రిపేరు రామోజీరావ్‌ గైక్వాడ్‌. రజనీ అసలుపేరు శివాజీరావ్‌ గైక్వాడ్‌. చలనచిత్ర రంగంలో అడుగుపెట్టకముందు రజనీ ఎన్నో సినిమా కష్టాలు అనుభవించారు. కర్నాటకలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసిన ఆయన ..తన స్నేహితుడు తోటి డ్రైవర్‌ సహాయంతో నటనపై మక్కువతో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అక్కడే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్‌ కళ్లలో పడ్డారు రజనీకాంత్‌..మొదటి సినిమా అపురూప రాగంగల్‌తో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటజీవితాన్ని ఆరంభించారు.

    ఆ తర్వాత ప్రతినాయక పాత్రల్నీ పోషించారు. అతన్ని హీరోగా నిలబెట్టిన మొదటిచిత్రం ముత్తరామన్‌ దర్శకత్వంలో వచ్చిన భువన ఓరు కల్వికరు. అక్కడి నుండి చిత్రసీమను ఏలుతూ వస్తున్న రజనీ ఇప్పటివరకు 173 చిత్రాల్లో నటించారు. దక్షిణ భారత భాషా చిత్రాలతో సహా బాలీవుడ్‌, హాలీవుడ్‌, జపాన్‌ ,జర్మన్‌ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ముత్తు చిత్రం జపాన్‌ భాషాలో అనువదించబడి రికార్డ్స్‌ సృష్టించింది. ఆరుపదుల వయస్సులోనూ నవ యువకుడిలా తెరపై కనిపించడం ఒక్క రజనీకే సాధ్యమైంది.

    English summary
    Superstar Rajinikanth is celebrating his 62nd birthday today and this time it's a day of thanksgiving for millions of his fans as they celebrate his near-total recovery from kidney-related ailment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X