జైలర్ ఫస్ట్ గ్లింప్స్ తో షాక్ ఇచ్చారుగా… డిఫరెంట్ లుక్స్ తో దర్శనమిచ్చిన సునీల్, నాగబాబు
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని భాషల నుంచి స్టార్ క్యాస్ట్ ను ఎంపిక చేయడం విశేషం. ఇక మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లింప్స్ లో మూవీలో ఉన్న క్యాస్టింగ్ మొత్తాన్ని దర్శకుడు ఎలివేట్ చేయడం విశేషం. సినిమాలో మెజారిటీ క్యాస్టింగ్ అంతా కూడా నెగిటివ్ స్టేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా అర్థమవుతుంది. బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్, మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, టాలీవుడ్ నుంచి సునీల్, నాగబాబు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.

తమన్నా ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ చేస్తుంది. అలాగే మలయాళీ బ్యూటీ, ఉగ్రం ఫేమ్ మీర్నా మీనన్ కూడా మూవీలో ఉండడం విశేషం. సినిమా స్టోరీ ఏంటి అనేది చెప్పకపోయిన దర్శకుడు నెల్సన్ దిలీప్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని ప్రజెంట్ చేయబోతున్నారని గ్లింప్స్ బట్టి అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నాత్తై తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న మూవీ ఇదే కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సునీల్ విలన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ లో సునీల్ లుక్ చాలా ప్రత్యేకంగా ఉండడం విశేషం. చూడగానే ప్రత్యేకంగా కన్నింగ్ స్టేడ్స్ తో ఎట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా స్టైలిష్ లుక్ లో సాల్ట్ అండ్ పప్పర్ గడ్డంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. సినిమాలో అతని పాత్ర ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. అలాగే మోహన్ లాల్ కూడా రెట్రో స్టైల్ విలన్ లా కనిపిస్తూ ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











