Jailer: మరో యాక్షన్ సినిమాను స్టార్ట్ చేసిన రజనీకాంత్.. సీరియస్ లుక్ అదిరింది!
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలాంటి సినిమా స్టార్ట్ చేసినా కూడా మొదటి నుంచే అభిమానుల్లో అంచనాలు ఊహలకందని రేంజ్ లో పెరిగిపోతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా రజనీకాంత్ జైలర్ సినిమా పైనే ఉంది. రజినీకాంత్ 169వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా డిఫరెంట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి మొదలు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.
ఇక ప్రత్యేకంగా విడుదల చేసిన పోస్టర్ లో కూడా రజనీకాంత్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా హై యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అనిపిస్తోంది. ఇదివరకే చిత్ర యూనిట్ రజనీకాంత్ కు సంబంధించిన ఒక స్పెషల్ లుక్ విడుదల చేయగా మంచి స్పందనను అందుకుంది. ఇక ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు క్లారిటీ ఇస్తూ రజనీకాంత్ సీరియస్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక మరోసారి బాక్సాఫీస్ వద్ద తలైవా బాక్స్ ఆఫీస్ రికార్డులను క్రియేట్ చేసేలా ఉన్నాడు అనిపిస్తుంది.

అయితే జైలర్ సినిమా మధ్యలోనే ఆగిపోయింది అంటూ కొన్ని రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఎందుకంటే విజయ్ బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడంతో రజనీకాంత్ ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని చిత్ర నిర్మాణ సంస్థ అప్డేట్స్ ద్వారా క్లారిటీ ఇస్తూనే ఉంది. ఇక ఇప్పుడు మొత్తానికి షూటింగ్ కూడా మొదలైనట్లు తెలియజేశారు.
ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించబోతున్న విషయం తెలిసిందే. అలాగే రమ్యకృష్ణ కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. నరసింహ సినిమా తర్వాత రమ్యకృష్ణ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాలో వీరికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా హైలెట్ గా ఉంటాయట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











