twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొలిటికల్ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్.. ఇదే ఫైనల్.. ఇంకోసారి ఇబ్బంది పెట్టొద్దు అంటూ..

    |

    ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలియగానే అభిమానులు ఎంతగానో సంతోషించారు. తలైవా అదుగో వస్తున్నాడు.. ఇదుగో వస్తున్నాడు అని కోటి ఆశలతో ఎదురుచూసిన ఫ్యాన్స్ కు చివరకు నిరాశ కలిగించే వార్తను చెప్పిన విషయం తెలిసిందే. అయితే తలైవా మరోసారి తన రాజకీయ ఎంట్రీపై స్పంధించడం హాట్ టాపిక్ గా మారింది.

    MGR తరహాలోనే రజనీ..

    MGR తరహాలోనే రజనీ..

    తలైవా రాజకీయ ప్రస్థానంపై చర్చలు ఈనాటిది కావు. ఆయన సూపర్ స్టార్ ట్యాగ్ తో జనాల్లో తలైవా అనే గుర్తింపు తెచ్చుకున్నప్పటి నుంచే వస్తోంది. MGR తరహాలోనే రజనీ మంచి క్రేజ్ అందుకోవడంతో తమిళ రాజకీయాల్లో ఆయన కూడా సక్సెస్ అవుతారని చాలా మంది నమ్మకం. గత 30 ఏళ్ళుగా పొలిటికల్ నిర్ణయాలపై చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి.

    అనారోగ్య కారణాల వల్ల..

    అనారోగ్య కారణాల వల్ల..

    ఆయన రాజకీయాల్లోకి రానున్నట్లు గతంలో ఎన్ని రకాల రూమర్స్ వస్తున్నా కూడా రజనీకాంత్ ఏనాడు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడప్పుడు తనదైన శైలిలో ఇన్ డైరెక్ట్ గా రాజకీయాల్లో ఎంట్రీ ఉంటుందని చెబుతూ వచ్చారు. ఇక ఫైనల్ గా ఏడాది ఏండింగ్ లో పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పి ఒక్కసారిగా అభిమానుల్లో అంచనాలను పెంచారు. కానీ ఆ సమయానికి వచ్చేసరికి అనారోగ్య కారణాల వల్ల వెనుకడుగు వేశారు.

    'అల్లుడు అదుర్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్: స్టైలిష్ లుక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)

    నిరసనలు తెలిపిన తలైవా

    నిరసనలు తెలిపిన తలైవా

    ఇక రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకముందే ఎండ్ కార్డ్ పెట్టడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. రాజకీయ ప్రకటన ఉండబోదని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా చెన్నైలో నిరసనకు దిగారు. వెంటనే రజనీకాంత్ తన మాటను వెనక్కి తీసుకోవాలని భారీ స్థాయిలో ర్యాలీ కూడా నిర్వహించారు. ఇక ఈ విషయంపై తలైవా తన వివరణ ఇచ్చారు.

    లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్

    లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్

    సోషల్ మీడియా ద్వారా రజనీకాంత్ ప్రత్యేకంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదివరకే ఒకసారి రాజకీయాల్లోకి రాలేను అంటూ క్లారిటీ ఇచ్చిన తలైవా ఇప్పుడు మళ్లీ అదే తరహాలో వివరణ ఇచ్చారు. దయచేసి ఇంకెవ్వరు కూడా మరోసారి తనను రాజకీయాల్లోకి రావాలని ఇబ్బంది పెట్టవద్దు అంటూ నేనంటే గిట్టని వాళ్ళు చేసే ప్రదర్శనలో కూడా పాల్గొనవద్దని తమిళ అభిమానులకు లేఖ ద్వారా క్లారిటీగా వివరణ ఇచ్చారు రజనీకాంత్.

    ఇదెక్కడి తలనొప్పి తలైవా?

    ఇదెక్కడి తలనొప్పి తలైవా?

    కొంత అస్వస్థతకు గురైన రజినీకాంత్ హాస్పిటల్ కు వెళ్ళగానే ఒక్కసారిగా ఆయన ఆలోచనే మారిపోయింది. ఆరోగ్య కారణంగా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంతో మరో తలనొప్పి ఎదురవుతోంది. అభిమానులైతే చాలా హార్ట్ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే బావుంటుందని ఏకంగా ఆయన ఇంటికి చేరుకొని నిన్న సాయంత్రం నుంచి నిరసన తెలుపుతున్నారు. మరి అలాంటి అభిమానుల కోసం రజనీకాంత్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

    Recommended Video

    RajiniKanth : No Political Party Says Super Star | Actor Vijay పొలిటికల్ ఎంట్రీ పై ఒత్తిడి !

    English summary
    Fans were overjoyed to know that Indian superstar Rajinikanth is coming into politics. Taliva is coming .. It is known that the disappointing news was finally told to the fans who were waiting with high hopes that this is coming. However Taliva once again reacting to his political entry has become a hot topic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X